16 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ లను పెంచాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాలేజీ కోర్సులు చదివే బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల స్కాలర్షిప్ లను సంవత్సరానికి వచ్చే 5500 నుంచి 20వేలకు పెంచాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈరోజు సుందరయ్య కళాభవన్ లో  జరిగిన రాష్ట్ర సమావేశానికి రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షులు నీల వెంకటేష్ అధ్యక్షత వహించారు. విద్యార్థులను ఉద్దేశించి ఆర్. కృష్ణయ్య ప్రసంగిస్తూ పెరిగిన ధరల ప్రకారం స్కాలర్ షిప్ లు పెంచాలని డిమాండ్ చేశారు.  ప్రస్తుతం ఇస్తున్న స్కాలర్ షిప్ లు  5సంవత్సరాల క్రితం నిర్ణయించారు. ప్రక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ 20వేలు స్కాలర్ షిప్ ఇస్తున్నారు. మన దగ్గర కేవలం 5500 మాత్రమే ఇస్తున్నారు. ప్రస్తుతం అవసరాలకు తగ్గట్లు 20వేలకు పెంచాలని కోరారు.అనంతరం నీల వెంకటేష్ మాట్లాడుతూ 2007లో బి.సి సంఘం అద్యక్షులుప్రస్తుత పార్లమెంటు సభ్యులు ఆర్.కృష్ణయ్య 5 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేయగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్  స్కీము ను ప్రవేశపెట్టారు. అప్పుడు కాలేజి కోర్సులు చదివే ప్రతి విద్యార్ధి 10 రూ అడ్మిషన్ ఫీజు కట్టి ఉచితంగా కాలేజి చదువు పూర్తి చేశారు. తెలంగాణా వచ్చిన తరువాత ఈ స్కీములను దశల వారిగా నీరు గార్చి మొత్తం ఫీజులను ఇవ్వకుండ ఇంజినీరింగ్ లో 10 వేల ర్యాంకు వరకు మొత్తం ఫీజులు చెల్లిస్తూ – మిగతాడిగ్రీ కోర్సులకు 10 వేలు మాత్రమే మంజూరు చేస్తూ స్కీమును నీరుగారుస్తున్నారు.ఈ సమావేశం లో గుజ్జ కృష్ణ ,గుజ్జ సత్యం,అంజి,జి,కృష్ణ యాదవ్,రాజ్ కుమార్,పి,సతీష్,మల్లేష్ యాదవ్, ప్రజాపతి బాస్కర్, నంద గోపాల్, ఉదయ్తదితరులు ప్రసంగించారు.

Leave A Reply

Your email address will not be published.