భారీగా హవాలా నగదు పట్టివేత

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: మునుగోడు ఉపఎన్నిక వేళ మరోసారి ఈరోజు భారీగా హవాలా నగదు పట్టుబడింది. టాస్క్ఫోర్స్ పోలీసులు ఈరోజు వాహన తనిఖీలు చేపడుతుండగా బంజారాహిల్స్ రోడ్ నం-12లో వాహనంలో తరలిస్తున్న రూ.2కోట్ల నగదు బయటపడింది.డబ్బుకు సంబంధించిన సరైన సమాధానం, పూర్తి వివరాలు డబ్బును తరలిస్తున్న వ్యక్తులు చెప్పకపోవడంతో పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. గత 10రోజుల వ్యవధిలో రూ.10కోట్లు హవాలా సొమ్ము పోలీసులకు పట్టుబడింది.

Leave A Reply

Your email address will not be published.