తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత డీ.శ్రీనివాస్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాంగ్రెస్ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీల్‌చైర్‌లో గాంధీభవన్‌ కు వచ్చిన డీఎస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ లో తిరిగి చేరుతుండటం ఎంతో ఆనందంగా ఉందని, సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని అన్నారు. తన పెద్దకొడుకు ధర్మపురి సంజయ్‌ తో కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే మరో నేత మేడ్చల్ సత్యనారాయణ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు డీఎస్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డీఎస్‌కు ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జానారెడ్డి షబ్బీర్ అలీ అంజన్ కుమార్ యాదవ్ పొన్నాల లక్ష్మయ్య రేణుకా చౌదరి ఇతర ముఖ్య నేతలు పార్టీలోకి ఆహ్వానించారు.కాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై అనర్హత వేటుకు నిరసనగా ఆదివారం గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి.హెచ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్, కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేణుకా చౌదరి, స్థానిక నేతలు దీక్ష చేపట్టారు. సాయంత్రం 5గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది.ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్‌లో మహిళలను అవమానించేలా మాట్లాడారని, ఆయనపై తాను కూడా పరువునష్టం దావా వేస్తానన్నారు. మోదీపై కేసు వేసే విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రధాని ఇప్పుడు తాను ఓబీసీ అంటున్నారని.. అయితే సూర్పనకతో తనను పోల్చారని… సూర్పనకది ఏ కులమని రేణుకా చౌదరి ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.