తల్లి కాబోతున్న సీనియర్ హీరోయిన్ పూర్ణ..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీనియర్ హీరోయిన్, ఇటీవల కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన పూర్ణ (Actress Poorna) తల్లికాబోతోంది. దుబాయ్‌కి చెందిన బిజినెస్‌మెన్ ఆసిఫ్ అలీని ఈ ఏడాది జూన్‌లో పూర్ణ వివాహం చేసుకుంది. కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న ఇద్దరూ కుటుంబ సభ్యుల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా తాను ప్రగ్నెంట్ అంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకి పూర్ణ తెలియజేసింది.

దశాబ్దానికి పైగా తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో పూర్ణ నటించింది. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. అలానే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగులో ఆమె నటించిన ఆఖరి సినిమా ‘తీస్‌ మార్ ఖాన్’. 2021లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ సినిమాలో ఓ కీలక పాత్రని పూర్ణ పోషించింది. ఆఫీసర్‌గా హుందాగా నడుచుకోవడంతో పాటు అత్యాచారానికి గురైన ఓ తల్లిగా ఆమె నటించిన తీరుకి ప్రశంసలు లభించాయి. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. కానీ ఈ ఏడాది ఆది హీరోగా నటించిన తీస్ మార్ ఖాన్‌లో ఆమె ఓ పాత్ర చేసినా.. మూవీ డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత సినిమాలకి కొన్నిరోజులు దూరంగా ఉండిపోయింది.

పూర్ణ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు టీవీల్లో కూడా కొన్ని షోస్‌లో జడ్జిగా వ్యవహరించింది. మరీ ముఖ్యంగా.. ఈటీవీలో ప్రసారమయ్యే షోస్‌కి ఆమె రెగ్యులర్‌గా వస్తుంటారు. వచ్చే ఏడాది ఆమె బిడ్డకి జన్మనివ్వబోతోంది. దాంతో కొన్నాళ్ల పాటు సినిమా, టీవీ షోస్‌కి పూర్ణ దూరంగా ఉండే అవకాశం ఉంది.

Comments are closed.