మహారాష్ట్రలో ఘోర ప్రమాదం..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: థానేలోని సర్లాంబే గ్రామ సమీపంలో వంతెన నిర్మాణం జరుగుతుండగా ప్రమాదం జరిగింది. గిర్డర్ యంత్రాన్ని అనుసంధానించే క్రేన్, స్లాబ్ 100 అడుగుల ఎత్తు నుంచి కిందపడింది.. గాయపడిన వారితో పాటు మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, NDRF‌ సిబ్బంది, ఫైర్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సహాయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం..తెల్లవారుజామున గిర్డర్ లాంచర్ మెషీన్ కుప్పకూలి 17మంది మరణించారు. థానే నగరంలోని సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవే ఫేజ్ 3 నిర్మాణంలో ఉపయోగించిన గిర్డర్ లాంచర్ మెషీన్ కూలిపోయింది. ఈ ఘటనలో 17మంది చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.

థానేలోని సర్లాంబే గ్రామ సమీపంలో వంతెన నిర్మాణం జరుగుతుండగా ప్రమాదం జరిగింది. గిర్డర్ యంత్రాన్ని అనుసంధానించే క్రేన్, స్లాబ్ 100 అడుగుల ఎత్తు నుంచి కిందపడింది.. గాయపడిన వారితో పాటు మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, NDRF‌ సిబ్బంది, ఫైర్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సహాయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. థానే జిల్లాలోని షాహాపూర్ తహసీల్‌లో బ్రిడ్జి స్లాబ్‌పై క్రేన్ పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

వెంటనే స్పాట్‌కి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నిర్మాణ కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలాన్ని సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ పరిశీలించారు. ఇక థానే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.