సేవా సంస్థలు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వ పథకాలను సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రచారం చేసి బడుగు బలహీన వర్గాలకు పథకాలపై అవగాహన కలిగించుకొని వినియోగించుకునే విధంగా కృషి చేయాలని డాక్టర్ వేణుగోపాల చారి పిలుపునిచ్చారు.ఇటీవల ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా ఆది లీల ఫౌండేషన్, మాతృదేవోభవ సత్సంగ్, సాయి సి ఫౌండేషన్ మరియు గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాదులోని మియాపూర్ లోని ఆదిలీల ఫౌండేషన్ హైదరాబాద్ కార్యాలయంలో శ్రీ వేణుగోపాల చారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆది లీల ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆదినారాయణ మాట్లాడుతూ డాక్టర్ వేణుగోపాలచారి గారు ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులు అవ్వడం హర్షనీయం అని వేణుగోపాల చారి అటు ప్రజానాయకుడిగా మరియు కళా రంగాన్ని పోషించే కళాభిమానిగా సమాజానికి ఎంతో సేవలు చేస్తున్నారని వారికి పదవి రావడం ఎంతో మంది కళాకారులకు ప్రోత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 29 1 2023 న అత్యధిక స్వచ్ఛంద సేవా సంస్థలు కలిపి కొండాపూర్ లో శ్రీ వేణుగోపాల చారి గారిని ఘనంగా సత్కరించాలనుకున్నామని ఆరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఘంటసాల శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఘంటసాల భక్తి సంగీత కార్యక్రమం మరియు అవధాన కార్యక్రమం నిర్వహించబడుతున్నదని ప్రముఖ సంఘ సేవకుడు మరియు కళాభిమాని అయిన ఆళ్ల రామకృష్ణ విశ్రాంతి చీఫ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అలాగే వేణుగోపాల చారి చేతుల మీదుగా పలు కళాకారులకు సత్కారం చేయనున్నట్లు  తెలిపారు కార్యక్రమంలో మాతృదేవోభవ సత్సంగ్ అధ్యక్షులు కేబి శ్రీధర్ సాయిసి ఫౌండేషన్ అధ్యక్షులు కేఎస్ఎన్ రాజు ఆది లీల ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రాజమాత విజయ దేవి గారు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.