సామాజిక సేవలో హైదరాబాద్ కే.యం.ఐ.టి ఇంజనీరింగ్ విద్యార్థుల సేవా దాతృత్వం

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్/ బాన్స్ వాడ ప్రతినిది:    హైదరాబాద్ నగరంలోని కేశవ మెమోరియల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు స్వచ్చందంగా సేవా దృక్పధం తో స్ట్రీట్ కాల్స్ కే.యం.ఐ.టి స్వచ్చంద సేవా దృక్పధంతో తమవంతు భాద్యతగా బాన్స్ వాడ పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం పాఠశాల విద్యార్థులకు అవసరమగు వస్తువులను స్వచ్చందంగా అందజేసి సామాజిక సేవలో తమవంతు భాద్యతగా దాతృత్వాన్ని చాటుకున్నారు. సామాజిక సేవను భాద్యతగా భావించి 80వేల రూపాయకు పైగా విలువ చేసే పరికరాలను పాఠశాల ఉపాధ్యాయ, పాఠశాల విద్యార్థులకు అందజేశారు.ఈ సందర్బంగా కేశవ మెమోరియల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కే.యం.ఐ.టీ స్ట్రీట్ కాల్స్ విద్యార్ధి స్వచ్చంద సేవ సంస్థ అధ్యక్షులు కందేవార్ రాజా బాలాజీ మాట్లాడుతూ సమసమాజంలో తమవంతు భాద్యత గా కడు నిరుపేదలకు, నిరుపేదవిద్యార్థులకు సామాజిక సేవలో భాగంగా సేవ దృక్పధంతో సామాజిక భాద్యతగా తమవంతు సహాయ సహకారాలను అందిస్తున్నామన్నారు.హైదరాబాద్ లోని కేశవ మెమోరియల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కే.యం.ఐ.టీ హైదరాబాద్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతూ కే.యం.ఐ.టీ స్ట్రీట్ కాల్స్ స్వచ్చంద సంస్థను స్థాపించి 3సంవత్సరాలు గడిచిందని గత సంవత్సరం నుండి సమాజంలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. తమ తల్లి దండ్రులు ఇచ్చిన ప్యాకెట్ మనిని వృధా ఖర్చులు చేయకుండా పోగుచేసిన ధన్నాన్ని సద్వినియోగం చేయాలనే సంకల్పంతో సామాజిక సేవలో భాగంగా నిరుపేదలకు గుణాత్మక విద్యా, మహిళా సాధికారిత, వృద్ధాశ్రమాలలో వృద్ధులకు సేవా, పర్యావరణ సేవ, అనాధపిల్లలకు వారి అవసరాలను తెలుసుకొని సేవా దృక్పధంతో వారికీ వస్తురూపేణ తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు.మా సేవ సంస్థ ఆధ్వర్యంలో గ్రామాలతో పాటు పట్టణాలలో, నగరాలలో సేవ కార్యక్రమాలను ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంతో పాటు నారాయణఖేడ్, హన్మంతరావుపేట్,మధ్వార్ తాండలో వాటర్ ట్యాoకు ద్వారా తాగునీటి అవసరాలను తీర్చామని అన్నారు. అలాగే బాన్స్ వాడ, బోధన్ నగరంలో సేవ కార్యక్రమాలను ఈ రోజు ఈ ఉన్నత పాఠశాల విద్యార్థుల అవసరాలను పాఠశాల ఉపాధ్యాయురాలు రేణుక గారు మా తల్లి బాల్యమిత్రురాలి సంపర్కంతో పాఠశాల విద్యార్థుల అవసరాలను తెలుసుకొని నాకు తెలియజేయడం వల్ల విద్యార్థుల ఇబ్బందులను తెలుపడం వల్ల పాఠశాలకు 30 సీలింగ్ ఫ్యాన్లు, విద్యార్థులకు దాహం తీర్చేందుకు గాను వాటర్ క్యూరీఫ్యయర్ ను, అలాగే రెండు సెట్ల సౌండ్ సిస్టమ్ కిట్లను అందజేస్తున్నామన్నారు.అలాగే మా సేవా సంస్థ ఆశయాలను 2030సంవత్సరాల వరకు భారత దేశంలోని పట్టణాలతో పాటు గ్రామాలలోని నిరుపేదలకు తమ వంతు సహాయ సహకారాలను అందించే లక్ష్యంగా తన మిత్రుల సహకారంతో సేవా కార్యక్రమాలను చేపడుతామన్నారు ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పరోక్షంగా పాఠశాలకు సహకారాన్ని అందించినందుకు ఉపాధ్యాయురాలు రేణుకను, స్వచ్చందంగా పాఠశాల అవసరాలను తీర్చిన కే.యం.ఐ.టీ స్ట్రీట్ కాల్స్ స్వచ్చంద సంస్థ సభ్యులను శాలువాలతో సన్మానించి వారి దాతృత్వానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజప్ప, ఉపాధ్యాయులు సాయిలు, లక్క నరహరి,ఎమ్మార్సీ శ్రీనివాస్ రక్షణకాంత్, వెంకట్రావ్, విజయ్,రేణుక, మణెమ్మ, ఉపాధ్యాయ బృందం, కే.యం.ఐ.టీ స్ట్రీట్ కాల్స్ సేవ సంస్థ సభ్యులు బజరంగ్, అఫ్రా, అన్విత, సుజన్, తేజస్వి, శ్రీ విద్యా,సంస్థ సభ్యులు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.