అంబేద్కర్ విగ్రహం పై లో దుస్తులు వేసి అవమానం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘోర అవమానం జరిగింది. ఈ మహనీయుడి విగ్రహాన్ని చెత్తకుప్పలో పడేయడమే అవమానకరం. అంతేకాకుండా విగ్రహంపై లోదుస్తులు వేసి మరింత దారుణంగా వ్యవహరించారు. ఈ ఘటనపై దళిత సంఘాలే కాదు అంబేద్కర్ ను అభిమానించే ప్రతిఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తాడేపల్లి అంజిరెడ్డి కాలనీ సమీపంలోని చెత్తలో అంబేద్కర్ విగ్రహం కొద్దిరోజులు పడివుంది. గుర్తుతెలియని వ్యక్తులెవరో ఈ విగ్రహాన్ని ఇక్కడ పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల పదవులు పొందిన నాయకులు, రిజర్వేషన్ల పుణ్యాన ఉద్యోగాలు పొందినవారికి ఈ విషయం తెలిసినా పట్టించుకోలేదు. దీంతో గౌరవప్రదంగా వుండాల్సిన ఆ మహనీయుడు విగ్రహం అక్కడే వుండిపోయింది.   వీడియో ఇలా చెత్తకుప్పల మధ్య అంబేద్కర్ విగ్రహం పడివుండటమే దారుణమంటే తాజాగా మరింత అవమానకర ఘటన చోటుచేసుంది. గుర్తుతెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహంపై లోదుస్తులు వేసి అవమానించారు. ఇది గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఇంత జరుగుతున్నా అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకునే నాధులే లేకుండా పోయారు.  అంబేద్కర్ కు జరిగిన ఈ అవమానానికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం , అధికారులు స్పందించి అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడినుండి తరలించాలని కోరుతున్నారు. రాజ్యాంగ నిర్మాతను అవమానించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.