కల్లు రుచిచూసిన షర్మిల.. వీడియో వైరల్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను షర్మిల తన పాదయాత్ర ద్వారా తెలుసుకుంటున్నారు. షర్మిల పాదయాత్ర ద్వారా పల్లెపల్లెకు తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూనే..మరోవైపు అధికారంలోకి రావడమే లక్ష్యంగా వివిధ వృత్తుల కార్మికులతో షర్మిల మాట్లాడుతున్నారు. పాదయాత్రలో భాగంగా బుధవారం రోజు లక్ష్మీనారాయణపురం వద్ద షర్మిల కల్లు గీత కార్మికుడితో మాట్లాడారు. కల్లు తాగాలన్న కార్మికుడి విజ్ఞప్తి మేరకు షర్మిల నీరాను తాగి రుచి చూశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్లు గీత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పాలకుర్తి నియోజకవర్గంలో షర్మిల పాదయాత్రతో పాటు రేతవంత్ హాత్ సే హాత్ జోడో యాత్ర కూడా కొనసాగుతోంది. దీంతో నియోజకవర్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవరుప్పుల మండలంలోని దుకాణాలను మూసివేయించారు. డ్రోన్ కెమెరాలతో పరిస్థితులను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్‌ను, కేసీఆర్ కుటుంబ పాలనను టార్గెట్ చేస్తూనే మరోవైపు ఒకరిపై ఒకరు కూడా విమర్శలు చేసుకుంటూ ఉండడం ఆసక్తికరంగా మారింది.ఇద్దరు ఫైర్ బ్రాండ్లు ఒకే నియోజకవర్గంలో ఒకే చోట పాదయాత్ర చేయనుండడం ఇప్పుడు పోలీసులకు సవాల్ గా మారింది. పెద్ద పని పెట్టింది. షర్మిల పాదయాత్ర పేరును రేవంత్ రెడ్డి బ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది పాదయాత్రనో లేక దొంగ యాత్రనో అర్థం కావడం లేదని, ఆయన పాదయాత్ర పై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని వైఎస్ షర్మిల విమర్శించారు. రేవంత్ రెడ్డి పిలక కేసీఆర్ చేతిలో ఉందని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.