మంత్రి కేటీఆర్‌తో పాటు ఆయన మినిస్ట్రీపై పోలీస్ స్టేషన్‌లో షర్మిల కేసు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మంత్రి కేటీఆర్‌తో పాటు ఆయన మినిస్ట్రీపై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కేసు పెట్టారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకుపై పూర్తి బాధ్యత కేటీఆర్‌దేనన్నారు. లక్షల మంది విద్యార్థుల జీవితాలు కేటీఆర్‌కి చిన్న విషయంగా కనిపిస్తున్నాయన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ పై కేటీఆర్‌ని విచారించాలన్నారు. కేసీఆర్ హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగ దీక్షలు చేస్తే మంత్రులు అవమానించారన్నారు. అయినా దీక్షలు చేశామన్నారు. విద్యార్థుల కోసం కొట్లాడుతుంటే ఆడబిడ్డ అని చూడకుండా తనను కూడా జైల్లో పెట్టారన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ సైట్ దర్యాప్తు‌పై నమ్మకం లేదన్నారు. పేపర్ లీకులతో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారన్నారు. టీఎస్‌పీఎస్సీలో అంత ఈజీగా పేపర్ లీక్ ఎలా చేశారన్నారు.

రాష్ట్రంలో అసలు భద్రత ఉందా?

‘‘టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ పూర్తిగా ఐటీ డిపార్ట్మెంట్ వైఫల్యం. కేటీఆర్ నాకేం సంబంధం. పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత కేటీఆర్‌దే. సిట్ దర్యాప్తు ప్రగతి భవన్ నుంచే నడుస్తోంది. ఎవరిని విచారించాలిఎవరి పేర్లు చేర్చాలి అనేది ప్రగతి భవన్ డైరెక్షన్ నుంచే నడుస్తోంది. ఐటీ శాఖ బాధ్యత వహించకపోతే ఎవరు బాధ్యత వహిస్తారురాష్ట్రంలో ప్రతి సిస్టంకి ఐటీ శాఖనే బాధ్యత వహించాలి. టీఎస్‌పీఎస్సీలో ఉన్న సిస్టమ్స్‌కి ఆడిట్ సర్టిఫికెట్స్ ఉన్నాయాటీఎస్‌పీఎస్సీ సిస్టమ్స్ మళ్ళీ హ్యాక్ జరగదని గ్యారెంటీ ఏంటి?’’ అని షర్మిల అన్నారు.

Leave A Reply

Your email address will not be published.