వివేకా హత్యపై షర్మిల స్పందన హర్షణీయం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాజీ మంత్రి వివేకా హత్యపై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల స్పందన హర్షణీయమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ జగన్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు. జగన్ సర్కార్ బాధితుల వైపు కాకుండా నిందితుల వైపు ఉన్నట్లు స్పష్టం అవుతోందని తెలిపారు. పులివెందుల రాజకీయం ఔరంగజేబు పాలనను గుర్తు చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి క్రూర రాజకీయాలు అవసరమా అని తులసిరెడ్డి ప్రశ్నించారు