బిగ్ బాస్ నుండి శోబా శెట్టి అవుట్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మొన్నటి వరల్డ్ కప్‌లో ఇండియా ఓడిపోయినప్పుడు కోట్లాది మంది ఎంత బాధపడ్డారో.. బిగ్ బాస్ హౌస్‌లో శోభాశెట్టి సేవ్ అయిన ప్రతిసారీ జనం అంతే బాధపడుతున్నారు. ఎవరైనా కంటెస్టెంట్ సేవ్ అయితే.. హమ్మయ్య సేవ్ అయ్యింద్రా బాబూ అని అనుకుంటారు.. కానీ శోభా సేవ్ అయిన ప్రతిసారీ.. వామ్మో ఈమె ఎలా సేవ్ అవుతుంద్రా బాబూ అని జనం జుట్టుపీక్కునేవారంటే శోభాశెట్టిపై ఏ రేంజ్‌లో నెగిటివిటీ ఉందో అర్ధం చేసుకోవచ్చు.ఛీ ఛీ.. ఇలాంటి ఆడపిల్ల మా ఇంట్లో కనుక ఉంటే పీక మీద కాలేసి తొక్కేసేవాడ్ని అని శివాజీ మనసులో మాట కక్కేసినా.. బిగ్ బాస్ చూసే చాలామంది ఆడియన్స్ మాట కూడా ఇదేనని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. శివాజీ గారు మాట అన్నారంతే.. మేమైతే నిజంగానే తొక్కేవాళ్లం అని శోభాపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. అంత దారుణమైన వరస్ట్ బిహేవియర్‌తో అందరితో ఛీ కొట్టించుకుంది శోభాశెట్టి. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఏడుగురిలోనే కాదు.. మొత్తం 20 మంది కంటెస్టెంట్స్‌లోనే కాదు.. ఇంతకు ముందు బిగ్ బాస్ అన్ని సీజన్లలోనూ చూసుకున్నా సరే.. బిగ్ బాస్ ఇంత ఏకపక్షంగా సపోర్ట్ చేసి.. అన్ ఫెయిర్ ఓటింగ్‌తో ఓ కంటెస్టెంట్స్‌ని ఎలిమినేషన్‌ని కాపాడిన దాఖలాలు లేవు. కానీ.. శోభాశెట్టి నామినేషన్స్‌లో ఉన్న ప్రతివారం జనాల్ని గొర్రెల్ని చేస్తూ.. వాళ్లు వేసిన ఓట్లను పక్కన పెట్టేసి శోభాశెట్టిని సేవ్ చూస్తూ వస్తున్నారనే ప్రచారం నిజమే అన్నట్టుగా శోభాని సేవ్ చూస్తూ వచ్చారు బిగ్ బాస్.నిజానికి ప్రతి సీజన్‌లో ఫినాలేకి వచ్చేసరికి జనం బీభత్సంగా పోటీ పడి ఓట్లు వేసేవారు. కానీ శోభాదెబ్బకి జనం ఓట్లేయడమే మానేశారంటే జనం ఆమెను ఎంత అసహ్యించుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. శోభాశెట్టి నామినేషన్స్‌లో ఉన్న ప్రతిసారి ఆమె లీస్ట్ ఓటింగ్‌లో కనిపించేది అన్ అఫీషియల్ పోల్స్‌లో కానీ.. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున మాత్రం.. శోభాశెట్టి సేఫ్ అనేసరికి ఓట్లేసిన జనానికి మబ్బులిడిపోయేవి.అసలు ఆమె ఎలా సేవ్ అవుతుంది అని తలలు పట్టుకునేవాళ్లు. దీంతో.. ఎలాగూ జనం వేసిన ఓట్లతో ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టనప్పుడు.. ఇక ఓట్లేయడం ఎందుకు దండగ అని ఫినాలే వీక్‌లో ఓట్లు వేయడం మానేశాడు జనం. మొత్తానికి ఆ ఎఫెక్టో.. లేదంటే శోభాని సేవ్ చేసే అగ్రిమెంట్ కార్యక్రమం ఈవారంతో ముగిసిందో ఏమో కానీ.. ఎట్టకేలకు ఆ కన్నడ కంత్రీ శోభాశెట్టిని ఎలిమినేట్ చేశారనే వార్త బయటకు రావడంతో.. సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు ఆమె హేటర్స్.అబ్బా సాయిరాం.. ఎన్నాళ్ల కెన్నాళ్లకు బిగ్ బాస్‌కి పట్టిన దరిద్రం పోయిందిగా.. ఆమె వరస్ట్ బిహేవియర్‌కి కిరణ్ రాథోడ్, షకీలా, దామినిలు ఎలిమినేట్ అయిన తరువాతి వారంలోనే ఎలిమినేట్ కావల్సింది. ఎప్పుడో నాలుగో వారంలో ఎలిమినేట్ కావాల్సిన శోభాని.. 14వ వారం వరకూ తీసుకొచ్చాడంటే.. బిగ్ బాస్ నువ్వు మామూలోడివి కాదయ్యా అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి ఈ సీజన్‌లో పూర్తి నెగిటివిటీతో ఉన్న మంచి పేరుని చెడగొట్టుకుంది శోభాశెట్టి. కార్తీకదీపంలో మోనితగా అద్బుతనటనతో ఆకట్టుకున్న శోభాశెట్టి.. రియల్ లైఫ్‌లో తాను మోనిత కంటే డేంజర్ అని చెప్పకనే చెప్పింది. కార్తీకదీపం సీరియల్ ద్వారా వచ్చిన ఏళ్లకి ఏళ్లు సంపాదించిన మంచి పేరుని.. 95 రోజుల్లో చెడగొట్టేసుకుంది శోభాశెట్టి.

Leave A Reply

Your email address will not be published.