ఏప్రిల్ 3.4 తేదీలలో పార్లమెంట్ ముట్టడి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 3.4 తేదీలలో పార్లమెంట్ ముట్టడి  కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని  శ్రీకృష్ణ యాదవ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రామూర్తి యాదవ్ పిలుపునిచ్చారు.నేడిక్కడ మీడియా సమావేశం లో రామ్మూర్తి యాదవ్ మాట్లాడుతూ జనాభాలో సగానికి పైన ఉన్న బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల రాజ్యాధికారంలో వాటా దక్కటం లేదని ఆందోళన వ్యక్తం చేసారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో 50 శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో చలో ఢిల్లీ ఏప్రిల్ 3.4వ తేదీలలో పార్లమెంటు ముట్టడి సూర్యాపేట నుంచి అత్యధిక సంఖ్యలో బిసి లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసి బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని, బీసీ కుల గణన చేయాలని, ఉద్యోగుల ప్రమోషన్ లో రిజర్వేషన్ కల్పించాలని ఏ వర్గాలకు లేని క్రిమిలేయర్ బీసీలకే ఎందుకని ప్రశ్నించారు. వెంటనే క్రిమిలేయర్ ఎత్తివేయాలని డిమాండ్ చేసారు. బీసీ సమస్యలు సాధించుకునే వరకు బిసి ల ఉద్యమాలు ఆగదని హెచ్చరించారు.ఒక బిసి వర్గానికి చెందినా ప్రదాన మంత్రి  ఉంది కుడా బిసిలకు న్యాయం జరుగక పోవడం సొచనీయమన్నారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వం బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించే విధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసారు. ఈ సమావేశం లో  బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్క వెంకట్ యాదవ్,లక్ష్మన్ నేత, వీరబోయిన లింగయ్య, భారీ అశోకు, గుండాల సందీప్, తగుళ్ళ జనార్ధ,న్ బంటు సందీప్, సంపత్ గాలి, వికాసం రామారావు, నిరంజన్ ,రాజేష్, లింగస్వామి, సతీషు, వివిధ బీసీ సంఘాలు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.