శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ బోర్డు అడ్వైజర్ గా సింగర్ మంగ్లీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ బోర్డు అడ్వైజర్ గా సింగర్ మంగ్లీని నియమిస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని జారీ చేయగా.. తాజాగా మంగ్లీ పదవీ బాధ్యతల్ని చేపట్టటం జరిగిపోయాయి.విభజన వేళలో వినిపించిన కీలక నినాదం.. నీళ్లు.. నిదులు… నియామకాల విషయంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని. దాన్ని సరిదిద్దుకునేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్రాన్ని కేటాయించాలన్నది డిమాండ్. దాన్ని పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజలు.. ఒక విషయాన్ని క్లియర్ గా తేల్చేస్తున్నారు. విభజన తర్వాత నుంచి రాష్ట్రానికి చెందిన ఏ కీలక పదవిలోనూ ఏపీకి చెందిన వారే కాదు.. ఏపీ మూలాలు ఉన్న వారిని సైతం తీసుకోవటానికి  ఏ మాత్రం ఇష్టపడటం లేదు.తెలంగాణలో రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగు వారి విషయంలో విభజన రేఖ ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు.. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి ఒకరి తర్వాత ఒకరు చొప్పున కీలక పదవులు కట్టబెట్టటం దేనికి నిదర్శనంఅన్నది ప్రశ్నగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఇదంతా బాగానే ఉన్నా.. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరి తెలంగాణ ప్రజలకు.. ప్రముఖులకు పెద్దపీట వేయటాన్ని ప్రశ్నిస్తున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్ క్రిష్ణయ్యను ఏకంగా రాజ్యసభ సభ్యుడిగా చేయటం.. తనకు సలహాలు ఇవ్వటానికి నియమించుకున్న సలహాదారుల్లో పలువురు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారై ఉండటం దేనికి నిదర్శనంఅని ప్రశ్నిస్తున్నారు.ఏపీ మూలాలు ఉన్నప్పటికీ.. హైదరాబాద్ లోనే స్థిరపడి.. ఎప్పుడో పండక్కి తప్ప ఏపీ గురించి.. ఏపీ బాగు గురించి మాట్లాడని పలువురికి ఇప్పటికే పదవులు కట్టబెట్టిన సీఎం జగన్.. ఈసారి ఫక్తు తెలంగాణ ప్రాంతానికిచెందిన సింగర్ ను కీలక పదవిని అప్పజెప్పిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.మంగ్లీ విషయానికి వస్తే.. ఆమె అసలు పేరు సత్యవతీ. బోనాల పాటలతో ఫేమస్ అయిన మంగ్లీ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు. తాజా పదవి కారణంగా ఆమెకు నెలకు రూ.లక్ష వరకు జీతంతో పాటు మరిన్ని వసతులు ఇస్తారు. రెండేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇదంతా చూసిన వారు జగన్ ను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాల్సింది మాత్రం ఆంధ్రోళ్లు.కానీ.. అదే జగన్ మాత్రం తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి ఏపీ పాలనలో భాగస్వాముల్నిచేయటంలో అర్థమేముందన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. విలువైన ట్యాక్స్ పేయర్ల డబ్బును వేరే రాష్ట్రానికి చెందిన వారికి కట్టబెట్టటం ద్వారా ఆంధ్రోళ్లకు నష్టం జరుగుతుందన్న మాట తాజా ఎపిసోడ్ లో ఎక్కువగా వినిపిస్తోంది. ఊరికే ఏ పని చేయని జగన్.. ఇలా ఒకరు తర్వాత ఒకరు చొప్పున ఏపీకి తెలంగాణ ప్రాంతానికి చెందిన  వారిని ఎందుకు నియమిస్తున్నట్లుఅన్నది అసలు ప్రశ్న.

Leave A Reply

Your email address will not be published.