చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్బీసీ సమావేశం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు () అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం (SLBC Meeting) జరగనుంది. ప్రధానంగా వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై సమావేశం జరగనున్నట్లు సమాచారం. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపైనా ఎస్‌ఎల్‌బీసీ (SLBC)లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. అలాగే ఏపీ విద్యుత్‌పై ముఖ్యమంత్రి సాయంత్రం 3 గంటలకు శ్వేత పత్రం విడుదల చేస్తారు. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో.. ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ అందజేసింది.. మిగతా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేయడంపై సీఎం చంద్రబాబు దృష్టి సారిస్తున్నారు. కాగా విద్యుత్‌ రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ రంగంలో జరిగిన పరిణామాలను వెల్లడించనున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలపై మోపిన భారాలు, విద్యుత్‌ సంస్థలు చేసిన అప్పులపైనే ప్రధానంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. జగన్ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ రంగం అప్పులు రూ.1.12 లక్షల కోట్ల వరకు చేరుకున్నాయని అధికారులు లెక్క తేల్చిన్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.