కుల గనన తోనే సామాజిక న్యాయం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: జనాభా గణన సెన్సెస్ లో బీసీల అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేస్తూ బిలో పావర్టి లైన్ పార్టీ ఆద్వర్యం లో  దేశవ్యాప్త కోటి ఉత్తరాల ఉద్యమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారాసిగూడ చౌరస్తాలో  బిలో పావర్టి లైన్ (బిపిఎల్ )పార్టీ బొమ్మ నరేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి  ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ ముఖ్య అతిధిగా విచ్చేసి  కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన ప్రజలుస్థానికులచే పరికిపండ్ల అశోక్ ప్రధానమంత్రి కి ఉత్తరాలు రాయించి పోస్ట్ డబ్బాలో వేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  అశోక్ మాట్లాడుతూ బీసీల లెక్క తేలితేనే రాజ్యాంగపరంగా మాకు రావాల్సిన హక్కు సంక్రమించబడుతుందనిఅందుకే ఒక సామాజిక బాధ్యతగాఉద్యమ రూపంలో ప్రధానమంత్రి గారి దివ్య సన్నిధికి మన సవినయ విన్నపం-దేశవ్యాప్త కోటి ఉత్తరాల ఉద్యమమని పేర్కొన్నారు.రాజ్యాంగం ప్రకారంమేము మేము ఎంతో మా వాటా అంత అని  తేల్చాలని  అనే నినాదాన్ని బలంగా వినిపిస్తూ మా ఆకాంక్షను తెలియజేస్తున్నామని, సమాజంలో అన్ని వర్గాలు లెక్కలు తీయాలన్నారు.అనంతరం బిపిఎల్ పార్టీ  అద్యక్షులు బొమ్మ నరేందర్ నేత మాట్లాడుతూ అడవిలో తిరిగే పులులని అడుగులను బట్టి లెక్కలు ఇస్తారు…. రోడ్డున పెరిగే చెట్లను  లెక్కిస్తారు..రోడ్డుపై తిరుగుతున్న పశువులకు కూడా  వాటి సంఖ్యా నెంబర్లను ఇస్తారు.. మరి బీసీలు అంటే  రాజకీయ పార్టీలకు  ప్రభుత్వాలకు అంట చులకనా అని ప్రశ్నించారు.దేశ జనాబాలో 65 శాతం జనాబా ఉన్న బిసి లెక్కలు తేల్చక పోవడం దారుణమని విమరేశించారు.బిసి లు రోడ్డుపై తిరుగుతున్న పశువు కంటే హినమా అని ప్రశ్నించారు. దేశం రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తే వాటిని జనాబా ప్రకారం బిసి లపై రుద్దటం తప్ప అత్యదుఇక జనాబా ఉన్న బిసి కు ఒనగుడుతున్న లాబమేమిటని ప్రశ్నించారు.బిసి కులగన న విషయమై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అసలు రాష్ట్రం చేపట్టిన బిసి జన గణన లెక్కలు బహిర్గతం చేయాలని నరెందర్ట్ డిమాండ్ చేసారు.  సెన్సెస్ లో బీసీల కుల గనన అంశంపై సంఘటితంగా పోరాడుదాంమన హక్కులను సాధించుకుందాం,రండి కదలిరండి,అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో  జయరాజ్,బాలు,కృష్ణ,నర్సింహారావువిద్యాసాగర్,  సుధాకర్,  రాజేంద్రప్రసాద్ప్రభాకర్,  జోసెఫ్,  వీరేశంరమణయ్యసాగర్ లతో పాటు విశ్వవిద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.