సామాజిక సంఘ సంస్కర్త డా బి ఆర్ అంబేద్కర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సామాజిక సంఘ సంస్కర్త డా బి ఆర్ అంబేద్కర్ అని తెలంగాణా ఎంప్లొయ్స్ అసోసియేషన్ అద్యక్షులు ఆర్. నవీన్ కుమార్ ఎంప్లొయ్ కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేత్కర్ 132 జయంతి పురస్కరించుకొని నారాయణగూడ లోని ఐపిఎం ఆవరణలో అంబేత్కర్ విగ్రహానికి పులా మాల్క వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. రాజ్యాంగ రూపకల్పన లో కీలకమైన ముసాయిదా కమిటీ కి చైర్మన్ గా వ్యవహరించారనీ చెప్పారు. దేశానికి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగము ను రాసి భవిష్యత్తులో దేశం ఎదుర్కొనే అనేక సవాళ్లకు పరిష్కార మార్గాలు చూపారని ఎస్పీ కొనియాడారు. దేశానికి డా బి ఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివనీ కొనియాడిన ఆయన  అంబేద్కర్ ప్రపంచంలోనే పేరొందిన గొప్ప న్యాయవాది, మానవతా వాది అని పేర్కొన్నారు. లండన్ లో ప్రముఖ విశ్వ విద్యాలయం డా బి ఆర్ అంబేద్కర్ కు మాస్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ప్రధానం చేసిందన్నారు. ఆర్థిక శాస్త్రంలో మొదటి పిహెచ్డి చేసిన వ్యక్తి డా బి ఆర్ అంబేద్కర్ రే నని చెప్పారు. డా బి ఆర్ అంబేద్కర్ కలలు గన్న దేశంగా, సూపర్ పవర్ గా భారత్ ఎదగాలంటే రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలు అత్యుత్తమ అభివృద్ధి సాధించాలని చెప్పారు.ఈ కార్యక్రమం లో పి.కృష్ణ ,ఎస్.సాయి షిండే ఏ.బాల స్వామి నవదీప్,జై దీప తదితరులు పాల్ గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.