కామారెడ్డిలో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి శ్రీమతి సోనియాగాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో నాయకులు శుక్రవారం సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేకును కట్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు అర్పిస్తున్న తరుణంలో సోనియా గాంధీ చలించిపోయి, ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టిన, అన్నింటినీ ఎదుర్కొని తెలంగాణ ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంటులో డిక్లేర్ చేయడం జరిగినది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మన తెలంగాణ ప్రజలు ఎంత చేసిన ఆమె రుణాన్ని తీర్చుకోలేము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొంతమంది స్వార్థపరులు ప్రజల శ్రేయస్సును విస్మరించి, వారి సొంత లబ్ధి కోసము పాటుపడుతున్నారు. కనుక రాబోయే రోజులలో తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియాగాంధీ రుణాన్ని తీర్చుకుందాం అని ఈ సందర్భముగా కోరుచున్నాను. ఇట్టి కార్యక్రమంలోపట్టణ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులుపండ్లరాజు, గు డుగుల శ్రీనివాస్, కామారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఐరన్ సందీప్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కారంగుల, అశోక్ రెడ్డి, కామారెడ్డి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు సిరాజుద్దీన్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పుట్నాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు గోనె శ్రీనివాస్ జొన్నల నరసింహులు, బట్టు మోహన్, పాక రవి ప్రసాద్, అడ్లూరు భూమన్న,శంకర్, మునీర్, కాకర్ల శేఖర్, హోసన్న, లక్కపతిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.