రాజ్యాధికారం-దివ్యాంగుల భాగస్వామ్యం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:ఇండియన్ ప్రజా కాంగ్రెస్ దివ్యాంగుల విబాగం ఆద్వర్యంలో రాజ్యాధికారం-దివ్యాంగుల భాగస్వామ్యం అనీ అంశం పై దివ్యాంగ సంఘాల తో సమాలోచన సదస్సు శివలెంక  ఉదయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. కావూరు శ్రీనివాస్ అద్యక్షతన జరిగిన ఈ సదస్సును  శ్రీ రామలింగేశ్వర దివ్యంగుల కాలనీ కుందన పెళ్లి కీసరలో ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేబీ శ్రీధర్, జాతి అధికార ప్రతినిధి కావూరి శ్రీనివాస్, జాతీయ సలహాదారు సూర్య ప్రకాష్ రావు, తోపాటు పలు దివ్యాంగ సంఘాల నాయకులు గుత్తికొండ కిరణ్ శివ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా  శివలెంక  నాగవదయలక్ష్మి మాట్లాడుతూ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో దివ్యాంగ విభాగాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీకి అన్ని దివ్యంగా సంఘాలు మద్దతిస్తున్నాయని తిలిపారు.దివ్యాన్గుల  సమస్యలు హక్కులు చట్టాలపై జాతీయ స్థాయిలో అన్ని జీవంగా సంఘాలతో కమిటీ వేస్తున్నామని తెలిపారు. తెలంగాణ హక్కుల సాధన సమితి అధ్యక్షులు గుత్తికొండ కిరణ్ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ దివ్యాంగ విభాగం లో ఒక తీవ్ర వికలాంగులు కి ఉన్నత పదవి ఇచ్చి గౌరవించడం దివ్యాంగ ఆశలను ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందన్నారు. త్వరలో జాతీయ కమిటీ సభ్యులను నియమించేందుకు సిద్ధమవుతుందని అన్ని దివ్యాంగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మానస,ఐశ్వర్య, అరుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.