డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంపై కాంట్రాక్టర్లు,అధికారులతో స్పీకర్ పోచారం సమీక్ష సమావేశం

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : నియోజకవర్గంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణంపై అధికారులు, కాంట్రాక్టర్ల తో బాన్సువాడ లోని తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం స్పీకర్ పోచారం గారు మీడియాతో మాట్లాడుతూ. రాష్ట్రంలో రెండు పడక గదుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంఈ ఏడాది బడ్జెట్లో (2022-23) రూ. 10,000 కోట్లను కెటాయించింది. అందులో భాగంగా హడ్కో సంస్థ నుండి రూ. 1000 కోట్లను రుణంగా తీసుకోవడానికి గృహ నిర్మాణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న సంతకం చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో 2 ను అక్టోబర్10,2022న జారీ చేసింది. బాన్సువాడ నియోజకవర్గానికి మొత్తం పదివేల డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు అయ్యాయి. ఇందులో అయిదువేల ఇళ్ళ నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశాలు జరగగా మిగతా ఇళ్ళు నిర్మాణం పూర్తవుతున్న దశలో ఉన్నాయి. నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళకు  సంబంధించి  ఇప్పటి వరకు రూ. 120 కోట్ల బిల్లులు రావాలి మొత్తం బిల్లుల నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి వినతి చేయడంతో అంగీకరించారు. పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ఇళ్ళకు సంబంధించి రీడింగ్ లను అధికారులు, కాంట్రాక్టర్లు త్వరితంగా తీసుకుని వెంటనే ఫైనల్ చేయాలి. త్వరలోనే కాంట్రాక్టర్లు, లబ్ధిదారులకు ఇళ్ళ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు అందుతాయి అని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.