శ్రీపాద కాలువ పనులు గాలికి వదిలేశారు

- మండిపడ్డ రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శ్రీపాద 9వ ప్యాకేజి కాలువను రేవంత్ రెడ్డి సందర్శించారు. అసంపూర్తిగా ఉన్న కాలువను పరిశీలించారు. కాలువ పనులు పూర్తి చేయకపోవడానికి కారణాలపై అధికారులను ఫోన్ ద్వారా ప్రశ్నించారు. పనుల జాప్యంగా అధికారులను ప్రశ్నించారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ… శ్రీపాద కాలువ పనులు గాలికి వదిలేశారని మండిపడ్డారు. కడప జిల్లా (కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాన్నారు. లాభాలు దండుకుని, మిగిలిన పనులను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఆలస్యం కావడానికి , అంచనా వ్యయం పెరగటానికి కారణమైన సంస్థ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రాంత రైతులపై ఆ కాంట్రాక్టర్లకు ప్రేమలేదన్నారు. మంత్రి కేటీఆర్ కాంట్రాక్టర్లకు లొంగిపోవడం వల్లే పనులు ఆలస్యమయ్యాయని ఆరోపించారు. కమీషన్ల కక్కుర్తితో కేటీఆర్  రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. తక్షణమే 9వ ప్యాకేజి పనులు పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.