భక్తులతో కిటకిటలాడిన శ్రీశైలం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనాది కోసం అనేకమంది భక్తులు తరలి రావడం జరిగింది. సెలవు దినాలు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు తండోపతండాలుగా శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనం కోసం అధిక మంది భక్తులు ఆదివారం తరలివచ్చారు. శ్రావణమాసం పురస్కరించుకొని శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు ముగించిన తర్వాత దర్శనానికి భక్తులను వదిలారు. భక్తులందరూ వేలాది సంఖ్యలో తరలి రావడం వల్ల ప్రత్యేక కంపార్లట్మెంట్లను ఏర్పాటు చేశారు .శ్రీశైలం భ్రమరామిక మల్లికార్జున స్వామి దర్శనానికి కోసం వచ్చినటువంటి భక్తులకు ప్రత్యేక కంపార్ట్మెంట్లో పులిహోర ప్రసాదమును దేవస్థాన అధికారులు ఏర్పాటు చేశారు. దైవ దర్శనం కోసం ప్రత్యేక కంపార్ట్మెంట్లో భక్తులందరూ దాదాపుగా మూడు గంటలు వేచి చూడాల్సి వచ్చింది. స్వామివారి దర్శనం చాలా ప్రశాంతంగా ముగిసింది. అందులోనూ శ్రావణమాసం పురస్కరించుకొని దైవ దర్శనం కోసం ఇతర రాష్ట్రాల ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.