ఏపీ వ్యాప్తంగా నిలిచిపోయిన భూముల రిజిస్ట్రేషన్లు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఏపీ వ్యాప్తంగా భూ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యలతో ఉదయం నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. భూ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల దగ్గర జనాలు పడిగాపులు గాస్తున్నారు. జూన్‌ 1 నుంచి భూముల విలువ పెంపు నిర్ణయంతో జనంతో భూరిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి.రిజిస్ట్రేషన్స్ ఆదాయం ఏప్రిల్‌ నెలలో గణనీయంగా తగ్గిపోయింది. కొత్త ఆర్థిక సంవత్సరం కావడంతో ధరలు పెరిగిపోతాయనే ఉద్దేశంతో చాలామంది అరకొరగా ఉన్న లావాదేవీలను మార్చి నెలాఖరులోనే పూర్తి చేసుకున్నారు. దీనికితోడు ఇటీవల నిర్మాణరంగంలో మెటీరియల్‌ ధరలన్నీ భారీగా పెరిగిపోవడంతో బిల్డర్లు ఫ్లాట్ల రేట్లను పది శాతానికి పైగా పెంచారు. గతంలో మధురవాడలో చదరపు అడుగు రూ.4 వేలకు విక్రయించిన చోట ఇప్పుడు రూ.4,500 చెబుతున్నారు. అలాగే పెందుర్తి వైపు చ.అడుగు ఇంతకు ముందు రూ.3 వేలకు లభించగాఇప్పుడు రూ.3,400-రూ.3,700 వరకు అమ్ముతున్నారు. అటు స్టీల్‌ప్లాంటు పరిసరాల్లోను అలాగే చ.అడుగుకు రూ.400 నుంచి రూ.600 పెంచి విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లాట్ల అమ్మకాలు మందగించాయి. స్థలాలు కొనేవారు సైతం ప్రస్తుత రేట్లను చూసి వెనకడుగు వేస్తున్నారు. దాంతో స్థిరాస్తుల లావాదేవీలు తగ్గాయి. ఆ ప్రభావం ఆదాయంపై కనిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.