ఈనెల 30న రాష్ట్ర బీసీ న్యాయవాదుల సదస్సు

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్:  సామాజిక న్యాయసాధనకై బిసి న్యాయవాదుల సదస్సు ను ఈనెల 30న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించాలని బిసి న్యాయవాదుల ముఖ్యనాయకుల సమావేశం లో నిర్ణయించారు.శనివారం  బీసీ భవన్ లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా రాజ్యసభ సబ్యులు, అడ్వకేట్ ఆర్, కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆర్. కృష్ణయ్యతో పాటు  హై కోర్టు అడ్వకేట్స్ ఎస్. విజయ ప్రశాంత్నాగుల శ్రీనివాస్ యాదవ్బత్తుల కృష్ణరేపాకుల నాగేశ్వరరావుజక్కం వంశీకృష్ణరాఘవేంద్రసత్యనారాయణసంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో కృష్ణయ్య మాట్లాడుతూ సామాజిక న్యాయసాధనకై బిసి అడ్వకేట్ చేస్తున్న పోరాటాలు అజరామమన్నారు. సామాజిక న్యాయసాధనకై పోరాటం చేస్తున్న న్యాయవాదులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత స్థానం కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.హైకోర్టు,సుప్రీంకోర్టు జడ్జిల నియమకాలలో బిసి/ఎస్సి/ఎస్టి లకు జనాభా ప్రకారం రిజర్వేషన్ కోటా ప్రవేశపెట్టాలనిఅలాగే జూనియర్ బిసి అడ్వకేట్ కు  నెలకు 20 వేల స్టైఫండ్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రియలెస్టేట్ వ్యాపారం చేస్తుందని,దీనిని న్యాయవాదులుగా అడ్డుకోవాలని పిలుపు నిచ్చారు. చాలిచాలని సంపాదనతో జీవితాలను వెల్ల దీసే ప్రతి అడ్వకేట్ కు 250 గజాల ప్రభుత్వ స్థలంఇళ్ళ పట్టాలు మంజూరు చేయాలని కోరారు. అడ్వకేట్స్ అందరికీకుటుంబ సభ్యులతో ఇన్సూరెన్స్ వర్తింప చేయాలని కోరారు. ఇటీవల తెలంగాణా రాష్ట్రము లో న్యాయవాదుల పై దాడులు,హత్యలు  పెరిగి పోతున్నయని కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేసారు.బయట దాడులతో పాటి ఏకంగా కోర్ట్ ఆవరనలోనే లాయర్లపై దాడులు జరుగటం శోచనీయమన్నారు. డాక్టర్స్ మాదిరిగా లాయర్లకు కుడా రక్షణ చట్టం తీసుక రావాలని డిమాండ్ చేసారు.గతం తో పోల్చితే నేటి రాజకీయాలు బ్రస్టు పట్టి పోయాయన్నారు.రౌడీలు,గుండాలు,భూకబ్జా దారులు,రియలేస్టేట్ మాఫియా రాజ్యమేలుతుందని,వీరిని అరికట్టాలంటే మేధావులు, లాయర్లు రాజకీయాల్లోకి రావాలని కృష్ణయ్య పిలుపు నిచ్చారు.ఈ నెల 30న జరిగే మహా సభకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టులలో ప్రాక్టీస్ చేసె బిసి అడ్వకేట్స్ పాల్గొనాలని కృష్ణయ్య పిలుపు నిచ్చారు.ఈ సమావేశం లో అనంతయ్య,వేముల రామకృష్ణ,బిళ్ళ దీపిక తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.