రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి

- ముఖ్యమంత్రి కెసిఆర్

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశించారు. ప్రగతి భవన్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసిన విషయం తెలిసింది. భారీగా కురిసిన వడగళ్లకు భారీగా పంట నష్టం జరిగింది. ఈ క్రమంలోనే పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌ అక్కడికక్కడే ఎకరానికి రూ.10వేలు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అప్పటికప్పుడే జీవోను సైతం విడుదల చేయించారు.ఈ సందర్భంగా పంట నష్టంపై అధికారులతో చర్చించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎకరాకు రూ.10వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. క్లస్టర్ల వారీగా సర్వే చేయించి పంట నష్టం వివరాలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా రెండో విడత గొర్రెల పంపిణీపై కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని చెప్పారు. కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు చేపట్టాలని స్పష్టం చేశారు. సొంత స్థలం ఉన్న వారికి రూ.3లక్షల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు.గృహలక్ష్మి పథకానికి విధివిధానాలు రూపొందించాలని చెప్పారు. దాంతో పాటు పోడు భూముల పట్టాల పంపిణీ కోసం త్వరలోనే తేదీ ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో రెండో విడత గొర్రెల పంపిణీ, గృహలక్ష్మి పథకం ప్రారంభించడంతో పాటు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అధికారులకు ఆయా పథకాలపై మరోసారి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా భద్రాద్రి సీతారాముల కల్యాణ నిర్వహణకు రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించాలని, భక్తులకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.