విచ్చలవిడి వార్తలు..పత్రికల మనుగడకు ప్రమాదం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పత్రికలు,లేదా చానళ్లు విమర్శైనా,పొగడ్త అయినా వున్నది వున్నట్లు వ్రాయాలని లేదా మీడియా మనది మన ఇష్టం వచ్చినట్లు కవరేజీ ఇస్తే వాటిని డబ్బిచ్చి మరీ ఎందుకు కనుక్కోవాలని పాఠకులు,వీక్షకులు అనుకుంటే వాటి మనుగడ వారి వరకే పరిమితమయ్యే స్థితి రాకతప్పదని మేధావులు,సీనియర్ జాతీయ పాత్రికేయులు,వివిధ పక్షాల కార్యకర్తలు పేర్కొంటున్నారు.కాగా  విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీతో జనసేన నేత పవన్కళ్యాణ్  సమావేశం అనంతరం జరుగుతున్న పరిణామాలతో కొన్ని ప్రముఖ పత్రికలు,చానళ్లు బీజేపీ జనసేన పార్టీలకు సరైన కవరేజీ ఇవ్వడంలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాజ్యసభ సభ్యుడు బీజేపీ నేత జీ వీ ఎల్ నరసింహారావు కలసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వీర్రాజు చేసిన ఆరోపణ పట్ల విశ్లేషకులుఆయా పార్టీల కార్యకర్తలు అక్షరాల నిజమేనని పేర్కొంటున్నారు.వాస్తవానికి జాతీయ మీడియా పత్రికలు నిష్పాక్షికంగా వార్తలు,  కథనాలు అందిస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విపరీత ధోరణులు వ్యవహరిస్తున్నాయి అని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.   ప్రజాస్వామ్యంలో పత్రికలు పట్టుకొమ్మలనే నమ్మకానికి గంది కొడుతూ నిష్పక్షపాతంగా వార్తలు అందించాల్సిన పత్రికలు కొన్ని తమ పాత్రను మరచి కొన్ని పార్టీలతో అంటకాగుతూ ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు అని వారు భావిస్తున్నారు. పెడితే పెళ్లి లేకుంటే …కూడూ అన్నట్లు ఇష్టంగా వుంటే ఆకాశానికి ఎత్తటం,లేదంటే అథః పాతాళానికి దింపటం అలవాటుచేసుకున్న కొన్ని పత్రికల తీరు పాఠకులు ఇప్పటికే గమనించి పత్రికల పటనాన్ని తగ్గించి వేశారనిఈ కారణంతోనే ఇటీవల సోషల్ మీడియా లో ఒక ప్రముఖ పత్రికగా పేర్కొంటూ అధిక ప్రభుత్వ ప్రకటనల రెట్లు గుంజుకుంటున్న ఆపత్రిక మడ త విప్పని కొన్ని పేపర్ కట్టలు ఒక ముంత మసాలా షాపులో పొట్లాలకోసం (క్రింద ఆ పత్రిక కట్టలు ఫోటో తో వుంది) తరలి వెళ్ళిన వార్త వైరల్ అయ్యిందనిఎందుకోసం అన్ని పత్రికలను ప్రింట్ చేసి ఇలా కిలోల లెక్కన దొడ్డిదారి లో అమ్మకానికి వెళుతున్నాయి అన్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు అరా తీయ్యాలని వారు కోరుతున్నారు.ఇకనైనా వార్తను వార్తగా రాయకుండా వున్న పత్రికలనుచూపని చానెళ్లను బహిష్కరించాలని ఏదైనా పార్టీలు,లేదా సంస్థలు పిలుపిస్థేఇలా కట్టల రూ కోట్లకు పొట్లాలు కోసం వెళుతున్నాయి అన్న కారణంతో వ్యాపార సంస్థలు తమ ప్రకటనలు నిలిపి వేస్తే వాటి మనుగడ ఏమిటో ఆలోచించుకోవాలని విశ్లేషకులు,ఆయా పార్టీలు పీలుపిస్తే వాటి సర్కులేషన్,రేటింగ్స్ ఏస్థాయికి పడిపోతాయి అన్న విషయం గ్రహించి వున్నది వున్నట్లు అంటే విమర్శ అయినా,పొగడ్త అయినా రాయటం కనీస బాధ్యతగా మీడియా హౌస్ లు సమ తూకం పాటించేలా గుర్తించాలని వారు కోరుతున్నారు.లేదంటే పి డి ఎఫ్ ల స్థాయికి అలాంటి పత్రికలువి సి అర్ ద్వారా పూర్వం ఇంట్లోనే చూసేలా అలాంటి ఛానెళ్లు మారక తప్పదని వారు పేర్కొంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.