విద్యార్థుల మెస్ చార్జీలు – స్కాలర్ షిప్ లు  పెంచాలి

- మెహదీపట్నం లో విద్యార్థుల భారీ ధర్నా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పెరిగిన ధరల ప్రకారం రాష్టంలో 8 లక్షల మంది SC/ST/BC హాస్టల్ మరియు  గురుకుల పాఠశాల మరియు కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని అలాగే కాలేజీ విధ్యార్ధుల స్కాలర్ షిప్ లు పెంచాలని  డిమాండ్ చేస్తూ బిసి విద్యార్ధి సంఘం ఆద్వర్యం మేదిపట్నం లో విద్యార్థుల భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్ధి సంఘం  వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల రామ కృష్ణ మాట్లాడుతూ పెరిగిన ధరల ప్రకారం మెస్ ఛార్జీలు/స్కాలర్ షిప్ లు పెంచాలని డిమాండ్ చేసారు. పెరిగిన ధరల ప్రకారం మెస్ ఛార్జీలు పెంచాలని -ఉద్యోగులు జీతాలు పెంచుతారు.- మా స్కాలర్ షిప్ పెంచరా ?  అంటూ నినాదాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్  మా హాస్టళ్ళ పిల్లలను చూడండి” – మా బ్రతుకులు బాగు పరచండి” అంటూ నినాదాలు ఇచ్చారు.  ధర్నాను ఉద్దేశించి వేముల రామ కృష్ణ ప్రసంగిస్తూ 5 సంవత్సరాల క్రితం ఆనాటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్ చార్జీలు స్కాలర్ షిప్ లు కొనసాగిస్తున్నారు. ఇటీవల నిత్యావసర ధరలు, నూనెలు, పప్పులు, కూరగాయలు అన్ని ఆహార వస్తువుల ధరలు రెండు రెట్లు -మూడు రెట్లు పెరిగాయి. ఇలా పెరగడంతో హాస్టల్ మరియు గురుకుల పాఠశాల విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతున్నారు. ధరలు పెరుగడంతో హాస్టల్  “మెను” పాటించడానికి డబ్బులు సరిపోవడంలేదని గుడ్లు, పండ్లు తగ్గించారు. మరల హాస్టల్ విద్యార్థుల కష్టాలు ప్రారంభమయ్యాయి. హాస్టల్ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ప్రభుత్వానికి రాకపోవడం దుర్మార్గం. సంబంధిత మంత్రులు, కమిషనర్లు ఒకనాడు కూడా హాస్టళ్ళను సందర్శించి విద్యార్థుల సాదక బాధకాలు తెలుసుకోవడం. లేదు. మనం పోరాడకపోతే మన హాస్టళ్ళ పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదన్నారు.హోటల్ లో ఒక పూట భోజనం 60 రూపాయలు ఉంది. కాని హాస్టల్ విద్యార్థులకు మాటకు 10 రూ. లకు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. జైల్లో ఖైదీలకు నెలకు 2100 రూ. లు ఇస్తూ, హాస్టల్ విద్యార్థులకు 950 ఇవ్వడంలో ఏమైనా న్యాయం ఉందా అని ప్రశ్నించారు. భావి భారత పౌరులకు, కాబోయే డాక్టర్లకు, ఇంజినీర్లకు, శాస్త్రవేత్తలకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు పూటకు 10 రూ. ల నాసిరకం భోజనం పెడితే భావి భారత పౌరులు ఎలా అభివృద్ధి చెందుతారని ప్రశ్నించారు. ఎదిగే-చదివే వయస్సులో నాసిరకం ఆహారం పెడితే జ్ఞాన సమాజం ఎలా ఏర్పడుతుందని ప్రశ్నించారు.

ఉద్యోగుల జీతాలు రెండు సార్లు పెంచారు. శాసనసభ్యులు, మంత్రుల జీతాలు మూడురెట్లు  పెంచారు. వృద్ధాప్య ఫెన్షన్లను ఐదు రెట్లు పెంచారు. కాని ఎస్సీ/ఎస్టీ/మైనార్టీ విద్యార్థుల స్కాలర్ షిప్ లు /మెస్ చార్జీలు పెంచలేదు. ప్రస్తుతం ఇస్తున్న స్కాలర్ షిప్ లు  / మెస్ చార్జీలు 4 సంవత్సరాల క్రితం నిర్ణయించారు. అప్పటి పెంపుదల కూడా శాస్త్రీయంగా లేదు. యూనివర్సిటీ విద్యార్థులు మెసిబిల్లు రూ॥ 2800/- లు వస్తుంటే స్కాలర్షిప్లు రూ॥ 1500 లు మంజూరు చేస్తున్నారు. పైగా ఈ మధ్యకాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం స్కాలర్ షిప్ లు /మెస్ చార్జీలు పెంచవలసిన ఆవశ్యకత ఉంది.ఈ కార్యక్రమం లో బిసి ఐక్య వేదిక రాష్ట్ర అద్యక్షులు అనంతయ్య,బిసి సంఘం రాష్ట్ర అద్యక్షులు  సి. రాజేందర్,  తిరుపతి తో పాటు వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.