విజయంతంగా 36 ఉపగ్రహాలతో కూడిన జీఎస్ఎల్ వీ మార్క్ 3 – ఎం3 రాకెట్ ప్రయోగం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లోని ఇస్రో సంస్థ. 36 ఉపగ్రహాలతో కూడిన జీఎస్ఎల్ వీ మార్క్ 3 – ఎంరాకెట్ ను విజయంతంగా దూసుకెళ్లింది. ఈ ప్రయోగం కోసం శనివారం నుంచి కౌంట్ డౌన్ ను షురూ చేశారు. మొత్తం 24.30 గంటల పాటు సాగిన  కౌంట్ డౌన్ కు ముగింపు పలుకుతూ ఆదివారం ఉదయం గంటల వేళలో ప్రయోగాన్ని చేపట్టారు.5805 కేజీల బరువు ఉన్న 36 ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్ లో 87.4 డిగ్రీల వంపులోని కక్ష్యలోకి ప్రవేశ పెడతారు. ఈ ప్రయోగం 19.7 నిమిషాల్లో పూర్తి చేశారు. అనుకున్నది అనుకున్నట్లుగా ప్రయోగం సక్సెస్ కావటంతో శాస్త్రవేత్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ ప్రయోగం పూర్తిగా వాణిజ్యపరమైనది.  ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రెండు దశల్లో మొత్తం 72 శాటిలైట్లను ప్రయోగించేందుకు వీలుగా వన్ వెబ్ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఇందులో భాగంగామొదటి 36 ఉపగ్రహాలను గత ఏడాది అక్టోబరు 23న విజయవంతంగా ప్రయోగిస్తే.. తాజాగా రెండో విడత ప్రయోగంలో మరో 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. ఇక.. ఈ ప్రయోగం మొత్తం బ్రిటన్ కు చెందిన నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్ కంపెనీ.. భారత్ కు చెందిన భారతి ఎంటర్ ప్రైజస్ (అదేనండి ఎయిర్ టెల్) సంయుక్త అవసరాల కోసం దీన్ని ప్రయోగించారు. ఇస్రోతో చేసుకున్న వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.ఈ ప్రయోగంలో భాగంగా నాలుగేసి ఉప గ్రహాల్ని  ఒక్కో సారి విడుదల చేస్తూ.. మొత్తం తొమ్మిది విడతలుగా కక్ష్యలోకి ప్రవేశ పెట్టారు. ఈ ప్రయోగం సక్సెస్ తో మరిన్ని మెరుగైన సేవల్ని ఎయిర్ టెల్ అందించే వీలుంటుందని భావిస్తున్నారు. అయితే.. ఏయే సేవల కోసంతామీ ప్రయోగాన్ని చేపట్టిన వైనాన్ని ఎయిర్ టెల్ వెల్లడించలేదు.

Leave A Reply

Your email address will not be published.