విజ‌య‌వంతంగా ప్ర‌ళ‌య్ మిస్సైల్ ప‌రీక్ష‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: స‌ర్ఫేస్ టు స‌ర్ఫేస్ స్వ‌ల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్ ప్ర‌ళ‌య్‌ ను ఇవాళ ప‌రీక్షించారు. ఒడిశా తీరంలోని అబ్దుల్ క‌లామ్ దీవి నుంచి దీన్ని టెస్ట్ చేశారు. డీఆర్డీవో ఈ క్షిప‌ణిని డెవ‌ల‌ప్ చేసింది. పాక్‌, చైనాతో స‌రిహ‌ద్దుల‌ను ప‌టిష్ట‌ప‌రిచే ఉద్దేశంతో ఈ మిస్సైల్‌ను అభివృద్ధి చేశారు. ఇవాళ ఉద‌యం 9.50 నిమిషాల‌కు ప్ర‌ళ‌య్‌ను ప‌రీక్షించారు. అన్ని మిష‌న్ ల‌క్ష్యాల‌ను అందుకున్నట్లు ఓ అధికారి వెల్ల‌డించారు. 350 నుంచి 500 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ల‌క్ష్యాల‌ను ప్ర‌ళ‌య్ చేర‌గ‌ల‌దు. దీని పేలోడ్ కెపాసిటీ 500 నుంచి 1000 కిలోలు ఉంటుంది. ఘ‌న ఇంధ‌నంకు చెందిన ఈ మిస్సైల్‌ను పృథ్వీ డిఫెన్స్ వెహిక‌ల్ ఆధారంగా ప్ర‌యోగిస్తారు. నియంత్ర‌ణ రేఖ‌, వాస్త‌వాదీన రేఖ వ‌ద్ద ప్ర‌ళ‌య్ మిస్సైల్‌ను మోహ‌రించ‌నున్నారు. చైనాకు చెందిన డాంగ్ ఫెంగ్ 12, ర‌ష్యాకు చెందిన ఇస్కాండ‌ర్‌తో దీన్ని పోల్చుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.