తెలంగాణ భవన్‌ వద్ద మిన్నంటిన గెలుపు సంబరాలు

.. హుజురాబాద్‌, దుబ్బాక ఉప ఎన్నికలతో పోల్చితే మునుగోడులో తెరాసకు ఊరట .. తెరాస శ్రేణుల్లో జోష్‌ నింపిన మునుగోడు ఫలితం .. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బ్యూరో చీఫ్: ఎట్టకేలకు ఆదివారం మద్యాహ్నంకు తేటతెల్లమైంది. తన సమీప ప్రత్యర్ది భారతీయ జనతాపార్టీ రాజగోపాల్‌రెడ్డిపై తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 10 వేల ఓట్ల ఆదిక్యంతో విజయబావుటాను ఎగురవేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెరాస శ్రేణులు గెలుపు సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆదివార ంసాయంత్రం బంజారాహిల్స్‌ లోని తెలంగాణ భవన్‌ ఎదుట తెరాస శ్రేణులు భారీగా చేరుకుని పలువురు ఎమ్మెల్యేలు, మంత్రుల సమక్షంలో గెలుపు సంబరాలను జోరుగా నిర్వహించారు. దీంతో దుబ్బాక, హుజురాబాద్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఓటుమిని చవిచూసి తెరాస శ్రేణులను నిరాశకు గురిచేసినప్పటికి మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో నయా జోష్‌ను నింపింది. రాబోయే 2023 సార్వత్రిక ఎన్నికల్లో సైతం తిరిగి తెలంగాణ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని తెరాస శ్రేణులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అదేవిధంగా తమకు ఎదురులేదని విర్రవీగుతున్న కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా పార్టీకి సైతం మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఓ గుణపాఠం అవుతుందని తెరాస పార్టీ శ్రేణులు బాహాటంగా పేర్కొంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.