అగ్రవర్ణాలకు అనువైన భూములు..వెనుకబడ్డ వర్గాలను గుట్టలా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో  అగ్ర వర్ణాలకు మాదాపూర్ , జూబ్లీ హిల్స్ వంటి ఖరీదైన భూములను కట్టబెట్టి బీసీలకు గుట్టలలో భూములనిచ్చి ప్రభుత్వం వీటిని బీసీల ఆత్మగౌరవానికి నిదర్శనమనడం ముమ్మాటికీ అసంబద్దమని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ పేర్కొన్నారు..గడచిన 100 ఏళ్ల నుండే అనేక బీసీ కులాలకు  హైదరాబాద్ కేంద్రంగా స్వంత భవనాలున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలన్నారు.పద్మశాలీయులకు రెండు ఎకరాల భూమిని కేటాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగినదైనప్పటికీ శనివారం కోకాపేట్ లో నిర్వహించిన పద్మశాలీ ఆత్మగౌరవ భవన కార్యక్రమం ఆద్యంతం బీఆర్ఎస్ సభగా, ప్రభుత్వ భజన కార్యక్రమంగా కొనసాగిందని తెలిపారు.కుల పెద్దలకు ప్రాధాన్యత నివ్వకుండా ప్రభుత్వ పదవుల్లో కొనసాగుతున్న పద్మశాలీ నాయకుల చేత జేజేలు పలికించుకోవడం కోసమే  ఈ సభను నిర్వహించిన విధంగా ఉందని ఉటంకించారు. ఈ పూర్తి వ్యవహారాన్నిఎన్నికల స్టంట్ గా పరిగణిస్తున్నామన్నారు..ప్రత్యేక రాష్ట్రమొస్తే చేనేత ఆత్మహత్యలుండవంటూ పదేళ్ల క్రితం పోచంపల్లి లో జోలెపట్టిన కేసీఆర్ కు అధికారమిస్తే పద్మశాలీలను ఏ మేరకు ఉద్దరించాడో తెలపాలన్నారు..ముఖ్యమంత్రిని ఆధ్యంతం పొగుడుతున్న బీఆర్ఏస్ పద్మశాలి నాయకులు ఇకనైనా పొగడ్తలు మాని ఇప్పటివరకు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకొని మరణించిన 400 చేనేత కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఒక స్థిర నివాసాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రితో చర్చలు జరపాలున్నారు..జరుగుతున్న పరిణామాలను పద్మశాలీలు సూక్ష్మంగా గమనిస్తున్నారని,ప్రభుత్వం ఇకనైనా చేనేత రంగం మీద , పద్మశాలీల రాజకీయ ఎదుగుదల పైన తమ విధానాలను మార్చుకోకపోతే రానున్న ఎన్నికలలో పెద్దఎత్తున ఈ వర్గపు దెబ్బను చవిచూడటం తప్పదని తెలిపారు..

Leave A Reply

Your email address will not be published.