ఆస్తులు డీ అటాచ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ఆర్డర్స్

-       హీరా గ్రూప్స్ సీఈవో డాక్టర్ నౌహిర షేక్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తమ ఇన్వెస్టర్లకు ఎలాంటి అన్యాయం జరగదని, త్వరలోనే అందరికి న్యాయం చేస్తామని హీరా గ్రూప్స్ సీఈఓ డాక్టర్ నౌహెరా షేక్ తెలిపారు. శనివారం నగరంలోని హీరా గ్రూప్స్ కార్పొరేట్ కార్యాలయంలో సుప్రీంకోర్టు న్యాయవాది వరప్రసాద్ తో కలిసి ఆమె మాట్లాడారు. కొంతమంది దురుద్దేశ పూర్వకంగా తమ సంస్థపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గత 20 ఏళ్లుగా ఎంతో నమ్మకం తాము వ్యాపారం చేస్తున్నామని, కానీ 2018లో తాను మహిళల కోసం మహిళ ఎంపవర్మెంట్ పార్టీని స్థాపించిన తరువాతే తనపై అక్రమ కేసులు నమోదు అయ్యాయని ఆమె వివరించారు. గత నాలుగేళ్లుగా తమ సుప్రీంకోర్టు లో న్యాయపోరాటం చేస్తున్నామని ఈ సందర్భంగా ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను డీ అటాచ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఇన్వేస్టార్స్ అందరికి న్యాయం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.