అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను తోసి పుచ్చిన సుప్రీం కోర్టు

-  25వ తేదీ వరకూ హై కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ని పక్కన పెట్టేసిన సుప్రీం   -  ఒక రోజు ముందుగానే అవినాష్ రెడ్డి కి ముందస్తు బెయిల్ రద్దు    -   జూన్ 30 వరకు  సిబిఐ విచారణ పొడిగింపు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ఆంధ్రప్రదేష్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ విషయాన్ని సుప్రీం కోర్టు తోసి పుచ్చింది. విచారణ సంస్థల దర్యాప్తులో జోక్యం చేసుకోవడం తగదని అభిప్రాయపడింది. ఈ నెల 25వ తేదీ వరకూ హై కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ని సుప్రీం పక్కన పెట్టేసింది. దాంతో ఒక రోజు ముందుగానే అవినాష్ రెడ్డి కి ముందస్తు బెయిల్ రక్షణ తొలగిపోయింది. ఇపుడు ఆయన విషయంలో ఏమైనా కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం అధికారం విచక్షణ సీబీఐకి దాఖలు పడ్డాయి.సీబీఐ ఏం చేయాలన్న దాని మీద సుప్రీం కోర్టు ఏ రకమైన డైరెక్షన్ ఇవ్వకపోయినా సీబీఐ ఇప్పటిదాక సంయమనంతో వ్యవహరించింది అని చెప్పడం ద్వారా సీబీ పని తాను చేసుకునేలా చేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద ఈ నెల 25న తెలంగాణా హైకోర్టులో వాదనలు వినిపించుకోవచ్చు అని చెబుతూనే అప్పటిదాకా అరెస్ట్ చేయవద్దని సీబీఐకి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం కోర్టు పేర్కొంది అంటున్నారు.సీబీఐ అరెస్ట్ చేయాలనుకుంటే ఎపుడో చేసి ఉండేదని అవినాష్ రెడ్డి తరఫున న్యాయవాదులతో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ఈ కేసు విషయంలో సుప్రీం కోర్టు ధర్మాసనం ఎదుట గంట పాటు వాడి వేడిగా ఇరు పక్షలా వాదనలు జరిగాయి సునీతారెడ్డి తరఫున లాయర్లు అయితే ముందస్తు బెయిల్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. సీబీఐ తరఫున లాయర్లు తమ విచారణకు ముందస్తు బెయిల్ అడ్డు పడుతోందని కూడా పేర్కొన్నారు అవినాష్ రెడ్డి తరఫున న్యాయవాదులు సీబీఐ అరెస్ట్ చేయకుండానే ముందస్తు బెయిల్ అంటూ తమ వాదనలు వినిపించారు.మొత్తం వాదనలు విన్న తరువాత సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ ని రద్దు చేసింది. అంతే కాదు సుప్రీం కోర్టు ఈ కేసు విషయంలో సీబీఐ కి ఈ నెల ముప్పయి దాకా ఇచ్చిన గడువుని జూన్ 30కి పొడిగించింది. దీంతో మరో రెండు నెలల పాటు ఈ కేసులో విచారణ జరిపేందుకు సీబీఐకి అవకాశం దక్కింది. ఇక ఈ కేసులో కొత్త కోణాలు కొన్ని వెలుగు చూస్తున్నందువల్ల సీబీఐ ఈ రెండు నెలల కాలాన్ని ఆ దిశగా సద్వినియోగం చేసుకుంటుందా అన్న చర్చ వస్తోంది.మరో వైపు చూస్తే ఆది సోమవారాలు రెండు రోజులూ సీబీఐ అధికారులు  పులివెందులలోనే ఉన్నారు. అణువణువూ అక్కడ పరిశీలిస్తున్నారు. ఇక సీబీఐ అధికారులు అక్కడ స్పెషల్ టీం ని రప్పించి బందోబస్తుని కూడా చేశారని అంటున్నారు. దీంతో ఏ క్షణమైనా అవినాష్ రెడ్డి అరెస్ట్ ఉంటుందా అన్నదే చర్చగా ఉంది. ఇప్పటికే తెలంగాణా హై కోర్టులో అవసరం అయితే అరెస్ట్ చేస్తామని సీబీఐ చెపిన నేపధ్యంలో ఇపుడు అరెస్ట్ చేసే సమయం వచ్చిందా అన్నది కూడా చూడాలని అంటున్నారు.ఏది ఏమైనా సీబీఐ ని గో ఎహెడ్ అనేలా  సుప్రీం కోర్టు తీర్పు ఉందని అంటున్నారు. అదే సమయంలో అవినాష్ రెడ్డికి తీవ్ర నిరాశ కలిగించేలా ఈ తీర్పు ఉందని అంటున్నారు. ఇక ఈ కేసులో తెలంగాణా హై కోర్టు ఈ నెల 25న విచారణ సందర్భంగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ మెద ఎలాంటి తీర్పు చెబుతుంది అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.