నేష‌న‌ల్ జుడీషియ‌ల్ డేటా గ్రిడ్ ఫ్లాట్‌ఫామ్ ప‌రిధిలోకి సుప్రీంకోర్టు

-  సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి డీవై చంద్ర‌చూడ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నేష‌న‌ల్ జుడీషియ‌ల్ డేటా గ్రిడ్ ఫ్లాట్‌ఫామ్ ప‌రిధిలోకి సుప్రీంకోర్టు రానున్న‌ట్లు భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి డీవై చంద్ర‌చూడ్ ఇవాళ ప్ర‌క‌టించారు. ఈ గ్రిడ్ ద్వారా పెండింగ్‌లో ఉన్న కేసుల్ని ట్రాకింగ్ చేయ‌వ‌చ్చు అని ఆయ‌న వెల్ల‌డించారు. డేటా గ్రిడ్ మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త‌జ‌వాబుదారీత‌నాన్ని పెంచుతుంద‌న్నారు. ఇది చ‌రిత్రాత్మ‌క‌మైన దినం అనిఈ విశిష్ట‌మైన ఫ్లాట్‌ఫామ్‌ను ఎన్ఐసీ డెవ‌ల‌ప్ చేసింద‌నిసుప్రీంకోర్టు ఇన్‌హౌజ్ టీమ్ కూడా ఆ ప్ర‌క్రియ‌లో పాల్గొన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. బ‌ట‌న్‌ను క్లిక్ చేస్తేరియ‌ల్ టైంలోనే ఆ పెండింగ్ కేసుల‌కు చెందిన స‌మాచారం వ‌చ్చేస్తుంద‌ని సీజే తెలిపారు. ఏ సంవ‌త్స‌రంలో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయిఎన్ని కేసులు రిజిస్ట‌ర్ అయ్యాయిఎన్ని కేసులు రిజిస్ట‌ర్ కాలేద‌న్న స‌మాచారం దాంట్లో ఉంటుంద‌ని సీజే చంద్ర‌చూడ్ వెల్ల‌డించారు.సుప్రీంకోర్టు వ‌ద్ద ప్ర‌స్తుతం 80 వేల కేసులు పెండింగ్‌లో ఉన్న‌ట్లు చంద్ర‌చూడ్ పేర్కొన్నారు.. ఇప్ప‌టివ‌ర‌కు ఎన్‌జేడీజీ ప‌రిధిలో సుప్రీంకోర్టు లేదు. సుప్రీం వ‌ద్ద మ‌రో 15 వేల కేసులు రిజిస్ట‌ర్ కావ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు. ఈ ఏడాది జూలైలో సుమారు 5వేల కేసుల్ని ప‌రిష్క‌రించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. త్రిసభ్య ధ‌ర్మాస‌నాల ముందు సుమారు 583 కేసులు పెండింగ్‌లో ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అయితే ఆ బెంచ్‌లు త్వ‌ర‌గా కేసుల్ని ప‌రిష్క‌రించేలా చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు చెప్పారు.డేటా క్లీనింగ్ చేప‌ట్టాల్సి ఉంద‌నిఫిజిక‌ల్ రికార్డుల‌కు.. డిజిటల్ డేటా మ్యాచ్ అయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. హైకోర్టులుజిల్లా కోర్టులు ఇప్ప‌టికే డిజిట‌ల్ ఫార్మాట్‌లోకి వెళ్లిన‌ట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.