సుప్రీంకోర్టు పెద్ద నోట్ల రద్దుపై కీలక తీర్పు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సుప్రీంకోర్టు పెద్ద నోట్ల రద్దుపై కీలక తీర్పును వెలువరించింది. నవంబర్ 8, 2016 న మోదీ సర్కార్ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంలో 58 పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీనిపై నేడు జస్టిస్ ఎస్.ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును వెలువరించింది. పెద్ద నోట్ల రద్దు నోటిఫికేషన్ చెల్లుబాటు అవుతుందని తెలిపింది. నవంబర్ 8న ఇచ్చిన నోటిఫికేషన్ సరైనదేనని సుప్రీం వెల్లడించింది. సెంట్రల్ బోర్డు నిర్ణయం తీసుకున్న మీదటే ప్రభుత్వం డిమానిటైజేషన్ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని.. కానీ ఇక్కడ రివర్స్‌లో ప్రభుత్వ నిర్ణయానంతరం సెంట్రల్ బోర్డుకు తెలపడం జరిగిందంటూ పిటిషనర్ల తరుఫు న్యాయవాదులు పి. చిదంబరం, ప్రశాంత్ భూషణ్ వాదించారు. అయితే నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నది సరికాదని కేంద్రం తరుఫు న్యాయవాదులు వాదించారు. విస్తృత ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే ఈ ప్రక్రియ సరైనదేనని పేర్కొన్నారు. నల్లధనానికి అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ అటార్ని జనరల్ వాదించారు.

Leave A Reply

Your email address will not be published.