మహిళ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: రాజ్యాంగ నిబంధనలు బీజేపీ పాలిత రాష్ర్టాలకు వర్తించవా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. నాగాలాండ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడంపై దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా మంగళవారం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ప్రతిపక్ష ప్రభుత్వాలపై మీరు కఠిన చర్యలు తీసుకొంటారు. మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలపై మాత్రం మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?’ అని కోర్టు నిలదీసింది.‘మహిళా రిజర్వేషన్లు రాజ్యాంగ నియమాల ప్రకారం అమలు చేయాల్సినవి. ఈ బాధ్యత నుంచి మీరెలా తప్పుకుంటారో నాకు అర్థం కావడం లేదు’ అని జస్టిస్‌ ఎస్కే కౌల్‌ వ్యాఖ్యానించారు. నాగాలాండ్‌లో మహిళల విద్యా, ఆర్థిక, సామాజిక స్థాయి మెరుగ్గా ఉన్నాయని.. అలాంటి రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్లు అమలు చేయలేకపోవడాన్ని తాము అంగీకరించలేమని కోర్టు తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.