పాల్ఘర్‌లో సాధువులపై మూకమ్మడి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహారాష్ట్ర పాల్ఘర్‌లో సాధువులపై మూకమ్మడి దాడిహత్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐవిచారణకు అనుమతిచ్చింది. ఘటనపై సీబీఐ విచారణకు అనుమతించాలంటూ షిండే సర్కారు సుప్రీం కోర్టును కోరడంతో అనుమతి మంజూరు చేసింది. అంతకు ముందు ఉద్ధవ్ థాక్రే సంకీర్ణ ప్రభుత్వం ఘటనపై సీబీఐ దర్యాప్తునకు అంగీకరించలేదు.పాల్ఘఢ్‌ జిల్లా గడ్చిఛాలె దగ్గర 2020 ఏప్రిల్‌ 16న రాత్రి సమయంలో ఇద్దరు సాధువులు మహరాజ్‌ కల్పవృక్షగిరి (70), సుశీల్‌గిరి మహరాజ్‌ (35), వారి కారు డ్రైవర్‌ నిలేశ్‌ తెల్గాడే 30)పై స్థానికులు కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడిచేసి చంపేశారు. సాధువులు ఇద్దరూ గుజరాత్‌లోని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. పిల్లల్ని ఎత్తుకెళ్లే దొంగలుగా అనుమానించి సాధువులను స్థానికులు చంపేసినట్టు పోలీసులు చెప్పారు. తమ సమక్షంలోనే అల్లరి మూకలు కొట్టి చంపుతున్నా పోలీసులు చోద్యం చూశారు. దీంతో ఈ ఘటనలో ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.ఈ కేసుతో సంబంధమున్న 100 మందికి పైగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా వారందరికీ ఎప్పుడో బెయిల్ కూడా లభించింది.మరోవైపు ఈ కేసులో సీఐడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. 4500 పేజీల ఛార్జ్‌షీటులో 165 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేశారు. వీరిలో 11 మంది బాల నేరస్థులు కూడా ఉన్నారు.ఘటనపై దర్యాప్తు నివేదికను అందజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. ఈ దాడి పోలీసుల సమక్షంలోనే జరిగినా.. స్పందించలేదంటూ దాఖలైన ఓ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఈవిధంగా స్పందించింది.పుకార్లు ఎవరు సృష్టించారు? అంత పెద్ద సంఖ్యలో జనం అక్కడ ఎలా గుమికూడారనే విషయాలపై లోతుగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని నాడు బీజేపీ, హిందూ సంస్థలు డిమాండ్ చేశాయి.

Leave A Reply

Your email address will not be published.