రోలెక్స్ పాత్రలో అదరగొట్టిన సూర్య

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్:

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని హిట్ అందుకోవడంలో సూర్య తరువాతే ఎవరైనా. ఇక ఇటీవలే విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో నటించి మెప్పించిన సూర్య ఆ పాత్రకు ప్రాణం పోశాడని చెప్పాలి. విక్రమ్ సినిమాలో ఉన్న కమల్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ లో 10 నిముషాలు ఉండే సూర్య పాత్ర ఒక ఎత్తు. ఈ సినిమాకు ప్రాంమ్ పోసింది సూర్యనే అని చెప్పడంలో కూడా అతిశయోక్తి కాదు. అయితే ఆ పాత్రను సూర్య ఇష్టం లేకుండానే చేశాడట. ఈ విషయాన్ని సూర్యనే స్వయంగా చెప్పుకొచ్చాడు.

తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సూర్య మాట్లాడుతూ “నేను ఈ స్థాయిలో ఇలా నిలబడిగలిగాను అంటే అందుకు కమల్ హాసన్ గారే స్ఫూర్తి. ఆయన ఫోన్ చేసి విక్రమ్ లో ఒక పాత్ర ఉందని చెప్పగానే దాన్ని వదులుకోవాలనిపించలేదు. కొన్ని పాత్రలు చేయాలంటే భయం ఉంటుంది. కానీ అలా భయపెట్టింది చేస్తేనే ఎదుగగలం అని నమ్ముతాను. అందుకే ఓకే చెప్పాను. నిజానికి లోకేశ్ ఫోన్ చేసి ఈ పాత్ర చేయమని అడిగితే చేయను అని చెప్పేద్దాం అనుకున్నాను. కానీ, కమల్ హాసన్ గారి కోసం ఈ పాత్ర చేయాలనిపించింది.. లోక నాయకుడు కమల్ హాసన్ గారి కోసమే రోలెక్స్ పాత్ర ఇష్టం లేకున్నా చేశాను” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ పాత్ర కోసం సూర్య పారితోషికం కూడా తీసుకోలేదు. సినిమా విజయం అందుకున్న తరువాత కమల్, సూర్యకు రోలెక్స్ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చిన విషయం విదితమే. ఏది ఏమైనా సూర్య కెరీర్ లో రోలెక్స్ పాత్ర నిలిచిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇష్టం లేకుండా చేసినా సూర్యకు మంచే జరిగిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.