బాలికల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఆడపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. బాలికల సంరక్షణ సమాన అవకాశాల కల్పన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సాయి చౌదరి తెలిపారు. బాలికల శ్రేయస్సు కోసం పాలకులు ఎన్ని పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ క్షేత్రస్థాయి లోపాల వల్ల సమస్యలు అలాగే ఉండిపోతున్నాయన్నారు. అయినా వారి సంరక్షణ విషయంలో సాధించింది ఏమిటని పరీక్షించుకుంటే నిరాశ మిగులుతుంది. దేశంలో ఏటా కోటికి పైగా ఆడ శిశువులు బ్రూణ హత్యలు జరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. శారీరకంగా మగ బిడ్డల కన్నా ఆడ శిశువులు బలంగా ఉంటారు. అయినా పోషకాహారము, ఆరోగ్య పరిరక్షణ వంటి విషయాల్లో విచక్షణ బాలికల పాలిట శాపం అవుతుంది. సమాజంలో ఎన్ని మార్కులు వచ్చినా బాల్య వివాహాల ఆగటం లేదు. వాటిలో 40% భారత్ లోనే జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి బాలల నిధి సంస్థ (యూనిసెఫ్) కొండ బద్దలు కొట్టిందని సాయి చౌదరి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు మూడు కోట్ల బాల్య వివాహాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటివల్ల భార్యాభర్తలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ బాలిక దినోత్సవం ప్రతి ఏటా అక్టోబర్ 11 నిర్వహించడం జరుగుతుంది. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, అనర్ధాలు నివారించి వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. 2012 అక్టోబర్ 11న తొలిసారిగా ఈ ప్రత్యేక రోజున నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతల (విద్యా,, పోషణ, చట్టవరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస, బలవంతపు బాల్య వివాహం పై వివక్షత పై) అవగాహన పెంపొందించడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం అని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి తెలిపారు.

 

కొడుకు ప్రైవేటు బడికి కూతురు ప్రభుత్వ పాఠశాలకు:

 

ఆడపిల్లలు మహాలక్ష్మి తో సమానం అంటూనే చాలామంది వారి ఆలనా పాలనా విషయంలో వ్యత్యాసాన్ని చూపెడుతుంటారు. మగపిల్లాడు పుడితే ఒకలా ఆడపిల్ల పుడితే మరోలా తల్లిదండ్రులు ముఖాలు మారడం మనం చూస్తూనే ఉంటాము. ఇదే తేడా ఆడపిల్లల విద్యాభ్యాసంలోనూ కనిపిస్తుంది. అన్ని హంగులు సౌకర్యాలు గల కార్పోరేట్ పాఠశాలలో కొడుకులను చదివిస్తూ, ఏమాత్రం ఖర్చులేని ప్రభుత్వ పాఠశాలలో బాలికలను చదివిస్తున్న ఘటనలు సమాజంలో అనేకం ఉన్నాయి.

 

కలవరి పెడుతున్న బ్రూణ హత్యలు:

 

ఆడపిల్లలు పుట్టకముందే చంపే సంస్కృతి నేటికి కొన్ని చోట్ల కొనసాగుతుంది. ఆడ శిశువుల పట్ల లింగ వివక్ష చూపుతూ తల్లి గర్భంలోనే ఉన్నపుడే చంపేస్తున్నారు. ప్రభుత్వం బ్రూణ హత్యల నివారణకు కఠిన చర్యలు అమలు చేస్తున్న అధికారులు నిర్లక్ష్యం వల్ల అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. చదువుకున్న వారు సైతం దీనికి అతీతులు కాకపోవటం దురదృష్టకరం. వైద్యరంగంలో సాంకేతిక విప్లవం ఆడపిల్లల పాలిటి శాపముగా మారింది. బ్రూణ హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బ్రూణ హత్యలు వల్ల మహిళా ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా చాలా మంది పట్టించుకోవడం లేదు. ఈ కారణంగానే ప్రస్తుతం బాల బాలికల నిష్పత్తి గణనీయంగా పడిపోయింది. ఇక కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేని కారణంగా చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లలను చదువు మాన్పించి వారిని బాల కార్మికురాలుగా దినసరి కూలీలుగా మారుస్తున్నారు .

 

ఏడడుగుల బంధం లో చిన్నారులు:

 

ఎన్ని యుగాలు మారినా మహిళల తలరాతలు మారటం లేదు. నిరక్షరాస్యత, పేదరికము తదితర కారణాలతో చాలా కుటుంబాలు ఆడపిల్లలను భారంగా భావిస్తున్నాయి. కులాచారాలు, మూఢనమ్మకాల పేరుతో ముక్కుపచ్చలారని చిన్నారి బాలికలకు మెడలో మూడు ముళ్ళు వేయిస్తున్నారు. దీంతో వారు తెలిసి తెలియని వయసులో తల్లులవుతూ రెండు పదుల వయసులోనే అనేక అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారు. బడికి వెళ్లి తోటి వారితో ఆడుతూ, పాడుతూ సంతోషంగా గడపాల్సిన వయసులో చంటి పిల్లలను భుజానికి ఎత్తుకొని వారి ఆలణాపాలన చూస్తున్నారు.

 

విద్యాసంస్థలోను తప్పని లైంగిక వేధింపులు:

 

విద్యాసంస్థలో చదువుకుంటున్న బాలికలకు భద్రత కరువైంది. పసిబాలికలపై కూడా పైశాచిక దాడులు జరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాము. పలుచోట్ల విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే ఆడపిల్లల పాలి–కీచకులుగా మారుతున్నారు. చిన్నారులను చరబడుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు వదిలాక చేరుకునే క్రమంలోనూ చాలామంది ఆడపిల్లలు ఈవ్టీచింగ్, కిడ్నాప్లకు గురవుతున్నారు. రాత్రివేళలో అయితే బాలికల భద్రత గాల్లో దీపం అన్న చందంగా మారింది. ఇక ఆడపిల్లల అక్రమ రవాణాలతో దేశ భవిష్యత్తు అంధకారంగా మారుతుంది.

 

బాల్య వివాహాల వల్ల అనర్ధాలు:

 

(1). పిల్లలందరికీ వారి సామాజిక ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా వారంతా పరిపూర్ణ వ్యక్తులుగా ఎదగడానికి తనకు ఇష్టపూర్వకమైన జీవితాన్ని గడపటానికి అభివృద్ధి చెందడానికి తగిన రక్షణ పొందటానికి అవకాశం ఉంది. బాల్య వివాహం వల్ల ఈ హక్కులన్నింటికీ భంగం వాటిల్లుతుంది. (2). బాల్య వివాహాల వల్ల బాలికలు శారీరక మానసిక ఎదుగుదల సరిగ్గా లేని సమయంలోనే గర్భం దాల్చే అవకాశం ఉంది. ఇది తల్లి బిడ్డ ఇద్దరికీ ప్రమాదకరం. ఎక్కువ శాతం మాత శిశు మరణాలకు బాల్యవివాహాలే కారణమని అనేక సర్వేలో వెల్లడయింది. (3).బాల్యవివాహాల వల్ల జన్మించే పిల్లల్లో పౌష్టికాహారలోపము, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. పిల్లలు తక్కువ బరువుతో జన్మిస్తారు. చిన్న వయసులో పెళ్లయిన బాలికలకు గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన పునరుత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది. మానసిక సమస్యలు తలెత్తుతాయి.

 

అధికారుల దృష్టికి రానివి వేలలో:

 

అధికారుల దృష్టికి వచ్చిన బాల్య వివాహాలను వారు అడ్డుకొని బాలికలకు విముక్తి కల్పిస్తున్నప్పటికీ, వారి దృష్టికి రాకుండా లోలోపలే గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న బాల్య వివాహాల సంఖ్య దేశంలో ఎక్కువగా ఉంది. చాలామంది అధికారులు ఇతరుల ఒత్తిడితో తాత్కాలికంగా పెళ్లిళ్లకు బ్రేక్ వేసిన సమయం చూసుకొని ఎవరికీ తెలియకుండా ఆ తంతు పూర్తి చేస్తున్నారు.

 

సర్వేలో వెళ్లడైన వాస్తవాలు:

 

ఆరేళ్లలోపు వయసు గల బాల బాలికల నిష్పత్తి గడిచిన 10 15 నెలలో ఘనంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ప్రతి 1,000 మంది బాలురపు కేవలం 914 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. ప్రతి ముగ్గురు ఆడ శిశువుల్లో ఒకరు ఏడాదిలోకి మృతి చెందుతున్నారు. అలాగే ప్రతి నలుగురిలో ఒకరు 15 నెలలోపు మృతి చెందుతున్నారు. ప్రతి ఐదుగురిలో ఇద్దరు బాలికలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రతి పదిమంది బాలికల్లో ఏడుగురు పదవ తరగతి పూర్తికాకుండానే చదువు మానేస్తున్నారు. ప్రతి పదిమందిలో ఆరుగురికి బాల్య వివాహాలు జరుగుతున్నాయి. వారిలో నలుగురు 18 ఏళ్లలో తల్లులవుతున్నారు.

 

చట్టాలు ఎన్ని ఉన్నా సమాజంలో మార్పు రావాలి సాయి చౌదరి:

 

బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు, అకృత్యాలను నివారించడానికి నిర్భయ లాంటి కఠినమైన చట్టాలు ఎన్నో అమలులో ఉన్నప్పటికీ తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సమాజంలో ఆడపిల్లల పట్ల వ్యక్తుల ఆలోచన దృక్పథము, ప్రవర్తన తీరులో మార్పు వస్తేనే వీటిని పూర్తిగా నిర్మూలించగలము. దేశం అన్ని రంగాల్లో శరవేగముగా అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తున్నప్పటికీ బాలిక సాధికారతను సాధించడంలో ఇంకా వెనుకబడే ఉందని అంగీకరించక తప్పదని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.