పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: విద్యార్థుల్లో సృజనాత్మకత ను పెంపొందించడానికి స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతోత్సవాలు  పురస్కరించుకొని శ్రీ పాలకూర్ల శివయ్య గౌడ్ స్మారక ఫౌండేషన్ చౌటుప్పల్ పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ పాలకూర్ల మురళి గౌడ్ తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు లక్ష రూపాయల బహుమతుల తో పాటు  జ్ఞాపికలు అమూల్యమైన పుస్తకాలు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈనెల 25వ తేదీ లోపు 984 8711 424 నంబర్ కు వాట్సాప్ ద్వారా తమ తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఆ తర్వాత వచ్చిన పేర్లను తిరస్కరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వాట్సాప్ లో విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్, ఫోన్ నెంబర్, పేరు, టైప్ చేసి పై వాట్సాప్ కు పంపగలరని కోరారు. రాత పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పించబడును. ఎగ్జామ్ సెంటర్ మరియు తేదీలను పరీక్ష తేదీలను మూడు రోజుల ముందుగా తెలియజేయడం జరుగుతుంది. ఎగ్జామ్ మే మొదటి వారంలో నిర్వహించబడుతుంది ఈ పోటీల్లో పాల్గొనేవారు ఎలాంటి ఎంట్రీ ఫీజును చెల్లించిన అవసరం లేదు. బేసిక్ సిలబస్ మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.