బ్యాడ్మింటన్ హబ్ గా తెలంగాణ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రపంచంలోనే బ్యాడ్మింటన్‌ క్రీడకు తెలంగాణ హబ్‌గా మారిందని, అనేకమంది యువ క్రీడాకారులు సాధిస్తున్న విజయాలు, చూపిస్తున్న ఆసక్తి ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందని స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అన్నారు. ఈరోజు తన కార్యాలయంలో ‘ఆల్‌ ఇంగ్లాండ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ – 2023’లో విజయాలు సాధించిన ఢల్లీి పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన హైదరాబాద్‌ క్రీడాకారులు రక్షా కందస్వామి, స్థితప్రజ్ఞ, అభిషేక్‌ కనపాలలను ఆయన తన చాంబర్‌లో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న రక్ష కందస్వామి, అభిషేక్‌, స్థితప్రజ్ఞలకు మంచి భవిష్యత్తు ఉందని ఖచ్చితంగా భవిష్యత్తులో ఒలంపిక్స్‌ మెడల్స్‌ సాధించే అవకాశం ఈ క్రీడాకారులకు ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఉన్న అంతర్జాతీయ స్థాయి క్రీడా సదుపాయాల ద్వారా ఔత్సాహిక క్రీడాకారులకు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి క్రీడా ప్రోత్సాహక విధానాల వల్ల యువ క్రీడాకారులు క్రీడల పట్ల ఆసక్తి చూపించడం, తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. క్రీడల ప్రోత్సాహానికి ఢల్లీి పబ్లిక్‌ స్కూల్‌ ఇస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని, క్రీడా కార్యక్రమాలకు చేయూతనందిస్తున్న ఛైర్మన్‌ కొమురయ్య సీఈవో యశస్విలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంకె బ్యాడ్మింటన్‌ అకాడమీ చీఫ్‌ కోచ్‌ వికాస్‌ హర్ష, తెలంగాణ ఒలంపిక్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు, ఢల్లీి పబ్లిక్‌ స్కూల్‌ క్రీడా సలహాదారు వెంకటేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.