షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. బీఆర్‌కే భవన్‌లో ఆయన శనివారం మీడియా సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియతో మాట్లాడారు. ఎన్నికలకు రెండు, మూడు నెలలు మాత్రమే సమయం ఉందని తెలిపారు. జిల్లాల్లో అధికారులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 15లక్షల మంది ఓటర్లుగా చేరారన్నారు. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. 6.99 లక్షల యువ ఓటర్లను నమోదు చేయించినట్లు చెప్పారు. మహిళా ఓట్ల సంఖ్య పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరుగుతుందని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పీస్ నిర్వహణ జరగనుందని చెప్పారు. అక్టోబర్‌ 3, 4, 5 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటన ఉంటుందని చెప్పారు. ఈవీఎంల తనిఖీ జరుగుతోందని, తుది ఓటర్ల జాబితా పూర్తయ్యాక జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఏజెన్సీలతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర పరిధిలో 20 ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు పనిచేయబోతున్నాయని, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అడ్రస్ మార్పుల ఫిర్యాదులు వచ్చాయన్న ఆయన.. వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Leave A Reply

Your email address will not be published.