రైతులకు అండగా తెలంగాణ సర్కారు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/బీర్కూర్: రైతులు పండించిన దాన్యం కొనుగోలుకు తెలంగాణ సర్కార్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా ఉందని తెరాస రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి తెలిపారు. బీర్కూర్ సహకార సంఘం పరిధిలోని కిష్టాపూర్, చించెల్లి, భైరపూర్ సహకార సంఘం, బీర్కూర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను అయన ప్రారంభించారు. రైతులు పండించిన వరి దాన్యం ఏ గ్రేడ్ కు 2060రూపాయలు, బి గ్రేడ్ కు 2040రూపాయలు మద్దతు ధర కు కొనుగోలు చేసి వారం రోజులలోపే రైతుల ఖాతాలో కొనుగోలు చేసిన దాన్యం సొమ్మును జమ చేస్తుందని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బీర్కూర్ సహకార సంఘం పరిధిలోని కిష్టాపూర్, చించెల్లి గ్రామాలలో సహకార సంఘం నిధులు 6లక్షల 50 వేల రూపాయలతో నిర్మించిన రెండు గోదాములను ప్రజాప్రతినిధులతో కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘు, బీర్కూర్ సహకార సంఘం అధ్యక్షులు కొల్లి గాంధీ, భైరపూర్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్, మాజి జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్,కో ఆప్షన్ ఆరీఫ్,కిష్టాపూర్, చించెల్లి, అన్నారం సర్పంచులు పుల్లేన్ బాబురావు, అంబయ్య, కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ రాధాకృష్ణ, పిఏసిఎస్ సిఇఓ విట్టల్, రైతు సమన్వయ అధ్యక్షులు అవారి గంగారాం, రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.