ప్రజల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం

- మంత్రి తలసాని

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రజల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర పశు సంవర్ధకమత్స్యపాడి పరిశ్రమల అభివృద్ధిసినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఇవాళ గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గన్ ఫౌండ్రీలో గల నేతాజీ కమ్యునిటీ హాల్‌లోజంబాగ్ డివిజన్‌లోని సుబాన్‌పురా కమ్యునిటీ హాల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలను మంత్రి శ్రీనివాస్ యాదవ్.. MLA రాజాసింగ్, MLC మీర్జా రహమత్ బేగ్‌లతో కలిసి ప్రారంభించారు. గన్ ఫౌండ్రీ బస్తీ దవాఖానాలో మంత్రికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. పేద ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాల్లో ఈ బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. GHMC పరిధిలో ఇప్పటి వరకు 350 బస్తీ దవాఖానల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇప్పటికే 153 బస్తీ దవాఖానలు పని చేస్తుండగానూతనంగా 14 బస్తీ దవాఖానలు ప్రారంభించనున్నట్లు వివరించారు.బస్తీ దవాఖానలలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా మందులు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు మంత్రి తలసాని. అవసరమైతే గాంధీఉస్మానియానిమ్స్ వంటి ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తారని అన్నారు. వైద్య సేవల కోసం పేద ప్రజలు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వందల కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. బస్తీ దవాఖానల ఏర్పాటు తర్వాత వైద్య పరీక్షల కోసం ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు.కోట్లాది రూపాయలు ఖర్చు చేసి CT స్కాన్, MRI స్కాన్క్యాత్ ల్యాబ్ వంటి అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. అన్ని రకాల వైద్య సేవలుగుండె మార్పిడిమోకాళ్ళ చికిత్సకిడ్నీ మార్పిడి వంటి అనేక ఆపరేషన్‌లను ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగానే చేస్తున్నట్లు వివరించారు. వేలాది రూపాయల విలువైన టెస్టులను కూడా ఉచితంగానే చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.