మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణా హైకోర్టు నోటీసులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ లోని ఓ స్థలం విషయంలో మెగాస్టార్ చిరంజీవికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు ప్రజల అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని చిరంజీవికి విక్రయించారన్న పిటిషన్ పై జరిపిన విచారణలో భాగంగా నోటీసులను జారీ చేసింది.

నిన్న ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో మెగాస్టార్ చిరంజీవికి జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ విక్రయించిన స్థలంలో ఎటువంటి కట్టడాలు చేపట్టవద్దంటూ చిరంజీవిని ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది. ఇక ఆ స్థలంలో నిర్మాణంపై స్టే కొనసాగించాలని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి, అలాగే చిరంజీవికి నోటీసులు పంపించింది. జూబ్లీ హిల్స్ లోని 595 చదరపు గజాల స్థలాన్ని జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ విక్రయించగా చిరంజీవి కొనుగోలు చేశారు. అందులో నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టారు.

అయితే ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన స్థలం అని, దానిని ఎలా విక్రయిస్తారని, అందులో ఎలాంటి కట్టడాలు చెయ్యరాదని జే. శ్రీకాంత్ బాబు తదితరులు కోర్టు మెట్లెక్కారు. ఈ స్థలాన్ని జీహెచ్ఎం సీ స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, కానీ వారు ఆ పని చెయ్యలేదని, దీంతో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ దానిని చిరంజీవికి విక్రయించిందని వారు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు విచారణ జరిపి నోటీసులు ఇచ్చింది. ఈ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలని చిరంజీవిని, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీని, అలాగే జీహెచ్ఎంసీని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇక ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ ఏప్రిల్ 25వ తేదీన జరగనుంది

Leave A Reply

Your email address will not be published.