సీసీ టీవీల ఏర్పాటు, నిర్వహణలో దేశంలోనే అగ్రస్థానం తెలంగాణ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్పలితాలు ఇస్తున్నాయని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు . ప్రభుత్వ సహకారంతో సీసీ టీవీల ఏర్పాటు, నిర్వహణలో తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. బుధవారం ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్‌ స్టేషన్ నూతన భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సమర్ధవంతంగా పనిచేస్తుండడం వల్ల రాష్ట్రంలో శాంత భద్రతలు అదుపులో ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో పోలీస్‌ శాఖకు అధునాతన వాహనాలను సమకూర్చారని , టెక్నాలజీ వ్యవస్థను మరింత బలోపేతం చేశారని కొనియాడారు. సీసీ టీవీల ఏర్పాటుతో నేరాల దర్యాప్తు, నేరాల నియంత్రణ సులభతరమైందని వెల్లడించారు.రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ హైదరాబాదు నగరంలో ట్రాఫిక్ సమస్య లేకపోవడం వల్లే సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి చెందిందని అన్నారు. డీజీపీ అంజని కుమార్ మాట్లాడుతూ పోలీసులు నిబద్ధత, సమన్వయంతో పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ డి.ఎస్. చౌహాన్, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయ లక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, తెలంగాణ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.