రేపు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కీలక భేటీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ భవన్ లో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు టిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన వహిస్తారు. ఈ సమావేశానికి తెరాస ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై లోతైన విశ్లేషణ జరగనుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమయత్వం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఒకవైపు టిఆర్ఎస్ను టిఆర్ఎస్ గా మార్చే ప్రక్రియ కొనసాగుతుండగా టిఆర్ఎస్ గా ఆవిర్భవించిన తర్వాత పార్టీ యంత్రాంగం ఏ విధంగా పనిచేయాలి పార్టీ కమిటీలు ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలపై చర్చించే అవకాశం ఉంది  ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నిక అనుభవాలు ఓటింగ్ పై విశ్లేషించిన తర్వాత దానిపై చర్చించనున్నట్లు తెలుస్తుంది రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తీరును ఎలా ఎండగట్టాలి కాంగ్రెస్ పార్టీ పట్ల వైఖరి ఎలా ఉండాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధాని మోడీతో పాటు భాజపా నేతలంతా తెలంగాణపై దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలని దానిపై సమావేశాలు చేయనున్నారు. టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ గా ఆవిర్భవించిన తర్వాత జాతీయస్థాయిలో ఎలాంటి పోరాటాలు చేయాలి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాజకీయంగా ఎలాంటి ఉద్యమాలు చేయాలని దానిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం ప్రస్తుతం గులాబీ పార్టీని జాతీయస్థాయిలో భారతీయ రాష్ట్రీయ సమితి చేసే యోచనలో ఉన్నందున ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave A Reply

Your email address will not be published.