తెలంగాణ రాష్ట్రము లోకవులకు, కళాకారులకు మంచి గుర్తింపు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిన తరువాతే కవులకు, కళాకారులకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ్రీ త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో కళా లలిత కళా వేదికలో సాహితీవేత్తలు డాక్టర్రఘుశ్రీ, పెద్దూరి వెంకటదాసు నిర్వహణలో కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్బంగా జనార్ధనమూర్తి మాట్లాడుతూ.. స్వతహాగా కేసీఆర్ గొప్ప సాహిత్యాభిమాని ఆయన పేర్కొన్నారు. దశాబ్ది కాలంలో అన్ని రంగాలలోను తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోభివృద్ధి సాధించిందని జనార్దనమూర్తి వ్యాఖ్యానించారు. ఎన్నో సరికొత్త పథకాలను ప్రవేశపెట్టి పేదల పాలిట పెన్నిధిగా కేసీఆర్ నిలిచారని ఆయన అన్నారు. అత్యధిక సంఖ్యలో కవులు, కవయిత్రులు పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందని జనార్దనమూర్తి పేర్కొన్నారు. పుస్తకావిష్కరణ సభలు, కవి సమ్మేళనాలను నిర్వహించడానికి గానసభ తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం సాహితీవేత్త డాక్టర్ రఘుశ్రీ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సభల్లో సాహిత్య సభలు నిర్వహించడం సముచితంగా ఉందన్నారు. ఈ సభ సాహితీవేత్తలు పెద్దూరి వెంకటదాసు, చిక్క రామదాసు పాల్గొని కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులను, కవయిత్రులను అభినందిస్తూ మాట్లాడారు. ముందుగా జరిగిన కవి సమ్మేళనంలో పలువురు కవులు, కవయిత్రులు స్వీయ కవితా గానం చేశారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులను, కవయిత్రులను కళా జనార్దనమూర్తి శాలువాలతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు.

Leave A Reply

Your email address will not be published.