తెలంగాణ వంజరి సేవసంఘం రాష్ట్రఉపాధ్య క్షుడిగా పోతన్కకు అంజయ్య

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్: తెలంగాణ వంజరి సేవసంఘం నూతన రాష్ట్రఉపాధ్య క్షుడిగా పోతన్కకు అంజయ్య రిటైర్డ్ ఉద్యోగి (హోమ్ శాఖ )ను నియమించినట్లు అఖిల భారత వంజరి సేవ సంఘం ఉపాధ్యక్షులు సాల్వేరు కృష్ణ వంజరి తెలంగాణ వంజరి సేవ సంఘం అధ్యక్షుడు  ఏదుగాని శంకర్  నారాయణ ధాత్రిక ధర్మరాజు లు  ప్రకటించారు . రిటైర్డ్ ఉద్యోగుల సంఘం లో క్రీయాశీల కంగా పనిచేస్తున్న అంజయ్యసేవలు తెలంగాణ వంజరి సేవసంఘం లో వినియోగించుకునేందుకు ఆయనను రాష్ట్రఉపాధ్య క్షుడిగా నియమించినట్లు వారు తెలిపారు .తన నియామకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ తనను నియమించినందుకు రాష్ట్ర కార్యవర్గానికి అయన ధన్యవాదాలు తెలిపారు. ప్రతి కులస్థుడికి ఉచిత సభ్యత్వముమరిన్ని అనుబంధ కమిటీలు తెలంగాణతెలంగాణ రాష్ట్రంలో ప్రతి కులస్థుడికి ఉచిత సభ్యత్వము -ఇవ్వాలనే సంకల్పం తో ఉన్నామని కులంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరికి  కుల సభ్యత్వం కలిగి  ఉండాలనే ఉద్దేశ్యంతో  ఉన్నామని త్వరలోనే ఉచిత సభ్యత్వ పుస్తకాలను కులస్తులకు అందజేసే ప్రక్రియ రూపొందుస్తున్నామని  వారు తెలిపారు .అఖిల భారత వంజరి సేవ సంఘం -అనుభందమై తెలంగాణ వంజరి సేవ సంఘము కోశాధికారితో పాటు మరి కొంత మందితో వివిధ పదవులను భర్తీ చెయ్యాలని ,గ్రేటర్ హైదరాబాద్  కమిటీ తో పాటు  మరికొన్ని అనుబంధ సంస్థల కార్యవర్గాన్ని త్వరలోనే ప్రకటిస్తామని అఖిల భారత వంజరి సేవ సంఘం ఉపాధ్యక్షులు సాల్వేరు కృష్ణ వంజరి తెలంగాణ వంజరి సేవ సంఘం అధ్యక్షుడు  ఏదుగాని శంకర్  నారాయణ ధాత్రిక ధర్మరాజు లు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.