తెలంగాణకు కొత్త గవర్నర్?..మహారాష్ట్రకు తమిళిసై బదిలీ ?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ఫుల్ ఫోకస్ పెట్టిన కేంద్రంలోని బీజేపీ ఇక్కడ రాజ్యాధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కేసీఆర్ ను గద్దెదించేందుకు అందివచ్చే ఏ అవకాశాన్ని వదిలిపెట్టవద్దని డిసైడ్ అయ్యింది. గొడవలతో ముదిరిపాకాన పడ్డ తెలంగాణ గవర్నర్ తమిళిసై వర్సెస్ కేసీఆర్ వివాదాన్ని తెగదెంచాలని చూస్తోంది. తమిళిసైకి కేసీఆర్ ఏ విధంగా సహకరించడం లేదని తెలియడంతో ఎలాగైనా కేసీఆర్ ను దెబ్బకొట్టడానికి ప్రత్యామ్మాయ నేత కోసం చూస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణకు త్వరలో కొత్త గవర్నర్ ను తీసుకురావాలని చూస్తున్నట్టు సమాచారం. మరి గవర్నర్ మార్పునకు కారణం ఏంటిఎందుకు మార్చాలని కేంద్రం చూస్తోందివచ్చే ఎన్నికల కోసమేనాఅన్న చర్చ మొదలైంది.తెలంగాణకు కొత్త గవర్నర్ రానున్నట్టు సమాచారం. తమిళిసైని మహారాష్ట్రకు బదిలీ చేయాలని చూస్తున్నారు. ఇక తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని కూడా తమిళిసై చాలా రోజులుగా చూస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వంతో గొడవ పెట్టుకొని మూడేళ్లుగా గౌరవం లేకుండా తమిళి సై ఉంటున్నారు. అనేక అవమానాలు పాలవుతున్నారు. కేసీఆర్ ఏ విషయంలోనూ తమిళిసైకి ప్రొటోకాల్ ఇవ్వడం లేదు.  తెలంగాణ అధికారులు పట్టించుకోవడం లేదు. కేంద్రంతో బీఆర్ఎస్ రాజకీయ వైరంతో గవర్నర్ తమిళిసై కూడా కేసీఆర్ కు యాంటీగా మారారు.ఇక మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ ఖోషియారీ తనను బాధ్యతల నుంచి తప్పించాలని.. తాను పబ్లిక్ లైఫ్ నుంచి తప్పుకొని ప్రశాంత జీవితం గడపాలని చూస్తున్నట్టు కేంద్రానికి తెలిపాడు. దీంతో ఆయనకు విశ్రాంతినిచ్చి ఆ స్తానంలో తమిళిసైను నియమించే అవకాశాలున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో తమిళిసైకి ఊరట లభించనుంది.తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తారని.. ఉత్తరాదికి చెందిన నేతలను పంపిస్తారని సమాచారం. లేదంటే దక్షిణాదికి చెందిన బీజేపీ నేతలను అయినా నియమిస్తారని తెలుస్తోంది.రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి తర్వాత ప్రధాని మోడీ.. అటు ప్రభుత్వ పరంగానూ.. ఇటు పార్టీలో సంస్థాగతంలో పలు మార్పులు చేయాలని భావిస్తున్నట్టు బీజేపీ కేంద్ర కార్యాలయం సమాచారం.ఈ ఏడాది రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే చోట కీలకమైన వ్యక్తులను గవర్నర్లుగా నియమించాలని కేంద్రం చూస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణగవర్నర్ ను మార్చడానికి సమాయత్తమైంది.

Leave A Reply

Your email address will not be published.